Advertisement
క్రికెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను ఏకం చేసే ఒక క్రీడ. క్రికెట్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అయితే.. అన్ని దేశాల జట్లు కలిసి పోటీ పడి మరీ ఆడుతూ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో టీం ఇండియా జట్టు వరుస విజయాలు సాధించింది. ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా.. అపజయం లేని జట్టుగా దూసుకెళ్తోంది. దీని వెనుక కోచ్ రాహుల్ ద్రావిడ్ పాత్ర ఎంతో ఉంది. తన వ్యూహాత్మక నైపుణ్యం మరియు ఆటపై లోతైన అవగాహనతో, ద్రావిడ్ టీమ్ ఇండియాను ప్రపంచ కప్‌లో స్ట్రాంగ్ టీం గా మార్చాడు.
Advertisement
2022 వరల్డ్ కప్ లో గాని, మొన్నా మధ్య జరిగిన ఆసియా కప్ లో గాని భారత్ జట్టు పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. ఆసియా కప్ లో అయితే.. కనీసం ఫైనల్స్ కి కూడా వెళ్లకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. రెండు టోర్నమెంట్‌లలో ఫైనల్స్‌కు చేరుకోలేకపోవడంతో విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. రాహుల్ ద్రావిడ్ సరైన కోచ్ కాదని, ముఖ్యంగా వరల్డ్ కప్, టీ20 ఫార్మాట్లకు సెట్ కాడు అంటూ చాలానే విమర్శలు వచ్చాయి. కానీ, నేడు టీం ఇండియా జట్టు ఇస్తున్న సక్సెస్ ల వెనుక ఆయన పాత్ర చాలానే ఉంది.
Advertisement
టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పాత్రను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ క్రికెటర్‌గా అతని అనుభవం మరియు ఆటపై అతనికి ఉన్న లోతైన జ్ఞానం అతన్ని జట్టుకు అమూల్యమైన ఆస్తిగా చేస్తాయి. ద్రవిడ్ యొక్క కోచింగ్ ఫిలాసఫీ ఆటగాళ్లకు సానుకూల మరియు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టించడం, వారి నైపుణ్యాలు మరియు విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడింది. టీం ఇండియా జట్టు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలతో ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి పది ఓవర్లలోనే తడపడినప్పటికీ.. వారికి ధీటుగానే సమాధానం చెప్పారు. నిన్నటి దాకా రాహుల్ ద్రావిడ్ ను విలన్ గా చూసినవారే.. నేడు హీరో అంటూ పొగిడేస్తున్నారు.
Read More:
క్రికెట్ లో “టైం అవుట్” అంటే ఏమిటి? మాథ్యూస్ ఎందుకు మ్యాచ్ నుంచి డిస్మిస్ అయ్యాడు?
ఈగ సినిమాలో ఇది గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు రాజమౌళి గారు?