Advertisement
తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో హమూన్ తుపాను బలపడడంతో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హై అలెర్ట్ ప్రకటించింది. బుధవారం ఉదయం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ వద్ద తీరం దాటిందని.. ఫలితంగా గంటకి 95 కి.మీ వేగంతో గాలులు వీచాయి అని వాతావరణ శాఖ పేర్కొంది.
Advertisement
ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఆగ్నేయ బంగ్లాదేశ్, మిజోరం వైపు వెళ్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తరువాత ఈశాన్యం వైపుకు వచ్చి అల్ప పీడనంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద సముద్ర మట్టానికి 1.5 కిమీ దూరంలో ఉపరితల ఆవర్తనం ఉందని.. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లో వర్షపు జల్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Advertisement
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, కోనసీమ ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే బుధవారం జియ్యమ్మవలసలో 24.2, కొమరాడలో 6.2 మి.మీ., కురుపాంలో 10.6, పార్వతీపురంలో 28.4 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. గత మూడు నెలలుగా రాష్ట్రంలో వర్షపాతం సరైన విధంగా లేక, పంటలు సరిగా పండక అన్నదాతలు ఇక్కట్లు పడ్డారు. చలికాలం మొదలైనా కూడా ఎండాకాలం తరహాలోనే ఎండలు దంచి కొట్టేస్తున్నాయి. తుపాను ప్రభావంతో గతంలో వర్షాలు పడతాయి అని అన్నదాతలు ఎదురుచూసారు. కానీ, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇప్పుడైనా సరైన వర్షపాతం ఉంటె బాగుందని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.
మరిన్ని..
IPL 2024: ఐపీఎల్ 2024 వేలానికి బీసీసీఐ రంగం సిద్ధం? ఎప్పుడు, ఎక్కడ జరగబోతోందంటే?
Martin Luther King Movie Review in Telugu: మార్టిన్ లూథర్ కింగ్ కథ, రివ్యూ & రేటింగ్..!