Advertisement
స్మాల్ స్క్రీన్ యాంకర్ శ్యామల పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన యాంకరింగ్ విధానంతో మంచి గుర్తింపు అందుకుంది. ఇక వెండి తెరపై కూడా కొన్ని పాత్రలో మెప్పించింది. శ్యామల తన సహా టీవీ టీవీ నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శ్యామల. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటుంది.
Advertisement
ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆంటీ వివాదం తెరమీదకు వచ్చింది. ఇకపోతే ఈసారి సీనియర్ నటుడు రవీంద్రా యాంకర్ శ్యామలను ఉద్దేశించి స్టేజి మీదనే ఆంటీ అంటూ సెటైర్లు వేశాడు. ఇక ఈ క్రమంలో త్వరలో విడుదల కాబోతున్న ‘తగ్గేదేలే’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అయితే నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజా రవీంద్ర మాట్లాడుతూ, యాంకర్ శ్యామల పై సెటైర్లు వేయడం హాట్ టాపిక్ అయ్యింది.
Advertisement
అయితే ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ “మా నిర్మాతలు ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి మంచి సినిమాలు తీయాలని ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చారు. ఇక వాళ్ళు తలుచుకుంటే ‘బాహుబలి’ లాంటి పది సినిమాలు తీయగలరు కానీ మాకు అలాంటి సినిమాలు వద్దు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే చాలు అనుకుంటున్నారు. అయితే అందుకే ఈ ‘తగ్గేదేలే’ తీశారు. కరోనా సమయంలో కూడా ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. కాగా భద్ర ప్రొడక్షన్స్ కంపెనీ, నిర్మాతలు మా అందరిని ఎంతో బాగా చూసుకున్నారు. ఇక ఈ సినిమాలో పనిచేస్తున్న అందరికీ ముందుగానే వ్యాక్సిన్లు వేయించడం, అందరికీ ముందుగానే పేమెంట్స్ ఇవ్వడం వంటివి చేశారు. అయితే మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకునేవారు” అని తెలిపారు. ఇక ఇలా నిర్మాతలు అందరికీ ధన్యవాదాలు చెబుతూ, ఆఖరిలో ముఖ్యంగా శ్యామల ఆంటీ కి కూడా థాంక్యూ అంటూ ఆమెపై కౌంటర్స్ వేశాడు. అయితే రాజా రవీంద్ర మాటలకు షాక్ అయినా శ్యామల ఆ వెంటనే తేరుకొని,’ నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టే’ అంటూ రాజా రవీంద్రా పై రివర్స్ కౌంటర్ ఇచ్చింది శ్యామల.
READ ALSO : T20 World Cup 2022 : సెమీస్ రేసులోకి పాకిస్తాన్ వస్తుందా ? ఇంటికి పోతుందా ?