Advertisement
ఇద్దరు స్టార్ హీరోలను సమానంగా.. ఏ ఒక్కరు ఎక్కువ కాకుండా.. మరొకరు తక్కువ కాకుండా ఒక సినిమాలో చూపించాలంటే.. అది దర్శక ధీరుడు రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య. మగధీర, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ ను తెచ్చుకున్న ఏకైక దర్శకుడు రాజమౌళి. స్టార్ హీరోల కంటే ఈయనకే ఎక్కువ పాపులారిటీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. రాజమౌళి ఏదైనా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు అంటే.. ఆ సినిమాపై ఏ స్టార్ హీరోకి లేనంత ఫోకస్ ఉంటుంది.
Advertisement
నిజానికి హీరోలు స్క్రీన్ పై మాత్రమే కనిపిస్తారు. ఓ నార్మల్ హీరోని స్టార్ హీరో చేయాలంటే అది రాజమౌళి లాంటి స్టార్ దర్శకులకే సాధ్యం అవుతుంది. ఆయన మైండ్ లో ఫిక్స్ అయితే.. కొత్త హీరోని అయినా స్టార్ హీరో చేసేయగలడు. ఎన్టీఆర్ మరియు ప్రభాస్ లతో రాజమౌళికి ఉన్న క్లోజ్ నెస్ ప్రత్యేకంగా చెప్పాల్సినది కాదు. ప్రభాస్ తో రాజమౌళి ఛత్రపతి సినిమా తీసిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ సినిమా రిలీజ్ తరువాత, రాజమౌళి ప్రభాస్ మరియు ఎన్టీఆర్ లను పెట్టి ఓ సినిమా తీయాలని అనుకున్నారట. ఇద్దరు టాలెంటెడ్ హీరోలతో 2006 లోనే మల్టీ స్టారర్ సినిమా తీయాలని రాజమౌళి అనుకున్నారు. నిజానికి ఇలా తీసి ఉంటె.. తెలుగు సినిమా రేంజ్ అప్పుడే ఓ లెవెల్ కి వెళ్లి ఉండేది. అయితే.. అప్పటి ప్రేక్షకుల ధోరణిని దృష్టిలో పెట్టుకుని ఏ మాత్రం తేడా కనిపించినా.. ఓ హీరోని ఎక్కువ చేసారు.. మరో హీరోని తక్కువ చేసారు అంటూ ఫ్యాన్ వార్స్ ఎక్కువ అవుతాయని భావించిన రాజమౌళి ఈ ఆలోచనని విరమించుకున్నారట. అయితే.. కొంత టైం తీసుకుని, పక్కాగా ప్లాన్ చేసుకుని ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించారు రాజమౌళి.
Read More:
Raja Reddy Love Story: అట్లూరి ప్రియా, రాజారెడ్డి ల లవ్ స్టోరీ ఇదే !