Advertisement
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ టీడీపీ లో అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. అధినేత అరెస్ట్ అయ్యి ఉండడంతో.. పార్టీ బాధ్యతలను అటు నారా లోకేష్ ఇటు నందమూరి బాలకృష్ణ తమ భుజ స్కంధాలపైకి ఎత్తుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించలేదు అంటూ కామెంట్స్ వచ్చాయి.
Advertisement
వీటిని కూడా చదవండి: చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఎన్టీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? అసలు కారణం చెప్పిన రాజీవ్ కనకాల!
అయితే.. గతంలో చాలా సార్లు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారం చేసాడు. అప్పట్లో తన స్పీచ్ తో యువతలో రక్తాన్ని పరుగులు పెట్టించేలా చేసాడు. అయితే.. ఇప్పుడు మాత్రం సిబిఎన్ అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనం వహించడం అనేక చర్చలకు తావిస్తోంది. అయితే.. ఈ విషయమై ఓ మీడియా విలేఖరి రాజీవ్ కానుకలను ప్రశ్నించారు. ఇందుకు రాజీవ్ కనకాల సమాధానం ఇచ్చారు.
Advertisement
వీటిని కూడా చదవండి: ఎక్కడ నుంచి వస్తాయో ఇలాంటి ఐడియాస్.. వీళ్ళ క్రియేటివిటీ మాములుగా లేదుగా..!
ఇప్పుడు అతని దృష్టి అంతా కెరీర్ పైనే ఉందని రాజీవ్ కనకాల అన్నారు. అందుకే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాల మీద కంటే సినిమాల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని రాజీవ్ సమాధానం చెప్పారు. కానీ సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా నెగటివిటీ వస్తోందో.. లేదంటే అనుకోకుండానే వస్తోందో తెలియడం లేదని అన్నారు.
ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు కచ్చితమైన కారణం నాకు తెలియదు అని అన్నారు.
నటన అంటే ఎన్టీఆర్ కి ఇష్టం అని.. కరోనా, ఆర్ ఆర్ ఆర్ సినిమా కారణాలతో నాలుగేళ్ళ గ్యాప్ వచ్చిందనీ.. అది భర్తీ చేసుకోవడానికే సినిమాల్లో బిజీ అయ్యాడని.. రాజీవ్ చెప్పుకొచ్చారు. అయితే.. ఎన్టీఆర్ మాత్రం కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని రాజీవ్ చెప్పడం గమనార్హం.
తారక్ కు తెలియకుండా.. రాజీవ్ కనకాల ఈ విషయాన్ని ఇంత బహిరంగంగా చెప్పే అవకాశం లేదని.. దీనిని బట్టి చూస్తే తారక్ తప్పకుండ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యంతోనే ఉన్నాడని తెలుస్తోంది.