Advertisement
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటు తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. రజనీకాంత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 71 ఏళ్ల వయసులో ఉన్న రజిని ఇప్పటికీ అదే స్టైల్ తో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నారు. రజనీ బాక్స్ ఆఫీస్ కింగ్ రికార్డ్ మేకర్ కూడా రజనీకాంత్ కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఇప్పటికి కూడా నిర్మాతలు ముందుకు వస్తున్నారు. రజనీకాంత్ చాలా మంది హీరోయిన్లతో నటించారు.
Advertisement
ఆయనతో నటించిన చాలామంది స్టార్ హీరోయిన్లు అయ్యారు అయితే ఆయనతో మాత్రం శ్రీదేవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుండేదట. వీళ్ళిద్దరూ కలిసి తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ఇలా నాలుగు భాషల్లో 19 సినిమాల్లో నటించారు. వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉందట ఒకానొక సమయంలో రజనీకాంత్ శ్రీదేవి మీద ప్రేమ పెంచుకున్నారు. శ్రీదేవిని ప్రేమించడంతోపాటుగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లితో కూడా చెప్పారట. ఆమెతో సూపర్ స్టార్ బాగా క్లోజ్ గా ఉండేవారట. అయితే శ్రీదేవి కంటే 13 ఏళ్ల పెద్దవాడు కావడంతో పెళ్లిపై శ్రీదేవి తల్లి ఆలోచించాలని చెప్పారట.
Advertisement
Also read:
ఓడినా కేంద్రంలో వైసీపీ కీలకమే..?
తనకంటే 13 ఏళ్లు చిన్నవాడు కావడంతో రజనీకాంత్ ఆమెకు రక్షణగా ఉండేవారట కానీ రజనీకాంత్ కి అవకాశం రాక శ్రీదేవితో ఈ విషయం చెప్పలేదట. ఒకానొకప్పుడు షూటింగ్ సమయంలో రజనీకాంత్ తీవ్ర అస్వస్థకు గురైతే శ్రీదేవి రజనీకాంత్ కోసం ఉపవాస దీక్ష కూడా చేశారట. రజనీ కోసం షిరిడి సాయిబాబాను ప్రార్థించిందట. ఏడు రోజులు ఉపవాసం ఉండి ఈ పూణేలోని సాయిబాబా ఆలయానికి వెళ్లారట. హఠాత్తుగా శ్రీదేవి చనిపోవడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. వార్త విన్న రజినీకాంత్ వెంటనే ముంబై వెళ్లారట శ్రీదేవి చనిపోయిన రెండు రోజులకే ఆయన పెళ్లి రోజు. కానీ ఆయన ఆ పెళ్లి రోజు జరుపుకోలేదట.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!