Advertisement
జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్లకి లైఫ్ ఇచ్చింది. అందులో ఒకరు రాకింగ్ రాకేష్. తన కామెడీతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. స్టేజ్ షోల దగ్గర నుంచి సినిమా నిర్మాతగా, నటుడుగా మారి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. జబర్దస్త్ లాంటి పాపులర్ షో ద్వారా పరిచయం అయినా రాకేష్ ఇప్పుడు కేసీఆర్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అయింది.
Advertisement
రాకేష్ ప్రేక్షకుల్ని మెప్పించాడు. నిర్మాతగా కూడా అతని సినిమాని కాపాడుకున్నాడు. తెలంగాణ నేటివిటికి తగ్గట్టు సినిమాని తీశారు. ఈ మూవీని చూస్తే చిత్ర యూనిట్ ఎంత కష్టపడిందనేది అర్థమవుతుంది. ఇంట్లో పిల్లాడు లేదా ఊర్లో ఉండే ఒక కుర్రాడు కథలా ఇది కనబడుతుంది. మూవీ ని చూసిన వాళ్ళందరూ రాకేష్ ని ప్రశంసిస్తున్నారు.
తను సినిమా చూస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. రాకేష్ తన భార్య, పాపతో కలిసి సినిమా చూశాడు. సినిమా చూస్తూ రాకేష్, సుజాత ఎమోషనల్ అయిపోయారు. కష్టానికి ఫలితం దక్కిందని ఎమోషనల్ అయిపోయారు. చాలామంది మూవీ బాగుందని అతనికి కంగ్రాట్స్ చెప్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి