Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనకంటూ ఓ రేంజ్ ని మెయింటైన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చెంజర్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా మీద మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇది ఎలా ఉంటే రామ్ చరణ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు వరుస సినిమాలను కమిట్ అయ్యాడు. ఇక ఇవి పూర్తి అవడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుంది.
Advertisement
అందులో భాగంగానే బుచ్చిబాబుతో చేస్తున్న పాన్ ఇండియా సినిమాతో పాటుగా ఆ సినిమా తర్వాత సుకుమార్ తో కూడా ఇంకో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం సినిమాకి సీక్వెల్ గా వస్తుందా లేదా ఫ్రెష్ స్టోరీ తో వస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ రెండు మూవీస్ అయిపోయిన తర్వాత లోకేష్ కనగరాజ్ 2 సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ తరవాత ఈ సినిమా చేస్తాడో లేదో తెలియదు రామ్ చరణ్ కూడా ఈలోపు ఎవరైనా మంచి కథతో వస్తే వాళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
Advertisement
Also read:
మొత్తానికి లోకేష్ చెప్పిన కథ రామ్ చరణ్ కి బాగా నచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఈ సినిమాలో చేసే అవకాశం కనబడట్లేదు లోకేష్ రామ్ చరణ్ కోసం అప్పటివరకు ఈ కథ పట్టుకుని వెయిట్ చేస్తాడా లేదంటే ఇంకో హీరో కోసం వెతుక్కుంటాడా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి లోకేష్ పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందరు చరణ్ అయితే గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి ఇవి చూడండి!