Advertisement
లవ్ అనేది ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చెప్పడం కష్టం. ఇలాంటి దానికి కరెక్ట్ గా సూట్ అయ్యేది రమప్రభ మరియు శరత్ బాబు మాత్రమే. శరత్ బాబు కంటే రమప్రభ వయసులో చాలా పెద్దది. అయినా వీరిద్దరు ప్రేమించుకున్నారు. అయితే రమాప్రభ ముందుగా శరత్ బాబుతో ప్రేమలో పడిందని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. అయితే రమాప్రభ అప్పటికి నటిగా ఒక వెలుగు వెలుగుతోంది. శరత్ బాబు మాత్రం ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఒకే రూమ్లో ముగ్గురితో కలిసి ఉండేవారు.
Advertisement
ఈ సమయంలోనే రమాప్రభ పరిచయమైంది ఇది కాస్త ప్రేమగా మారడంతో ఆయనకు అవకాశాలు కూడా పెరిగిపోయాయి. అయితే తాజాగా శరత్ బాబు అనారోగ్య సమస్యల వల్ల హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలా కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించారు. దీంతో ఆయన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. రమాప్రభ నిర్మాతగా శరత్ బాబు గారిని హీరోగా పెట్టి సినిమా కూడా తీశారని వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
అంతేకాదు అనేక అవకాశాలను కూడా ఆమె కల్పించారని కొంతమంది సీనియర్లు అంటున్నారు. అయితే వీరి మధ్య ఉన్న ప్రేమ కొన్ని రోజులకు పెళ్లి పీటలెక్కింది. వీరిద్దరికీ పెళ్లి అయిన 13 సంవత్సరాలకు గొడవల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే రమాప్రభను శరత్ బాబు తన అవసరాలకు వాడుకొని వదిలేసాడని కొంతమంది ఆరోపిస్తున్నారు. కానీ శరత్ బాబు బతికున్నన్ని రోజులు ఆమె బంధం గురించి గానీ, వారి గురించి గానీ ఎక్కడ కూడా నోరు విప్పలేదు. కానీ సోషల్ మీడియాలో ఆయన మరణించాక అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
మరికొన్ని ముఖ్య వార్తలు :