Advertisement
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సాధిస్తున్నాడు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ అందుకున్నాడు. ఆ తర్వాత రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో ఇండస్ట్రీలోని రికార్డులు బ్రేక్ చేసి ప్రత్యేక స్టార్డం తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా హిట్,ప్లాపులు లెక్కచేయకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోగా ఉన్నారు రామ్ చరణ్. మగధీర సినిమాలో రామ్ చరణ్ నటనకు యావత్ దేశమే ఫిదా అయింది. మొదటి సినిమాతో మాస్ లుక్ అన్న కామెంట్లను ఈ సినిమాతో ఒక్కసారి గా చేంజ్ చేశాడు. ఈ విధంగా ఇండస్ట్రీలో క్రేజీ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న రామ్ చరణ్.
Advertisement
also read:నా కూతురు పెళ్లికి మీరు రావొద్దు! సీఎంకి కాల్ చేసి చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ
Advertisement
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారని చెప్పవచ్చు. తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడని, ఇలా వరుస సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా స్టార్డం సంపాదించుకున్న రామ్ చరణ్ ని చూసి చిరంజీవి సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. అలాంటి రామ్ చరణ్ కెరియర్ లో ఈ ఒక్క సినిమా మాత్రం చిరంజీవికి అస్సలు నచ్చలేదట. ఈ సినిమా ఎందుకు చేశాడు రా బాబు అంటూ బాధపడుతున్నారట. అంతేకాకుండా ఆ సినిమాని స్వయంగా యాక్సెప్ట్ చేసింది చిరంజీవే కావడంతో మరింత బాధిస్తోందని తెలుస్తోంది.
ఆ సినిమా ఏంటయ్యా అంటే సరిగ్గా 8 సంవత్సరాల క్రితం వచ్చిన జాంజీర్ .. అయితే హిందీలో జాంజీర్గా తెలుగులో తుఫాన్ గా వచ్చింది. కానీ ఈ సినిమా పరమ చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రియాంక చోప్రాకు రామ్ చరణ్ తమ్ముడు గా ఉన్నాడంటూ కామెంట్లు కూడా వచ్చాయి. ఈ సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ సినిమా డిజాస్టర్ అంటూ, కథ ఎంపికలో ఫెయిలయ్యారంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు. అయితే ఈ సినిమాను చిరంజీవి దగ్గరుండి సైన్ చేయించి ఒప్పించడంతో, ఇది రామ్ చరణ్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ అవడంతో నా కొడుకు జీవితంలో నేను ఇలాంటి మిస్టేక్ చేసానని సురేఖకు ఎన్నోసార్లు చెప్పుకొని బాధపడుతూ ఉంటారట చిరంజీవి. ఏది ఏమైనా చిరంజీవి ఆలోచనకు రామ్ చరణ్ బలైపోయాడు అన్నది వాస్తవం.
also read: