Advertisement
Rangamarthanda Review, Rating, Story in Telugu: కొన్నేళ్ల గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజ నటులు కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే అందరిని ఆకట్టుకుని మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మరి నేడు మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన Rangamarthanda Review యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read also: తారకరత్న ని సొంత బంధువులే అంతలా ఇబ్బంది పెట్టారా ?
Rangamarthanda Story in Telugu: కథ మరియు వివరణ:
రంగమార్తాండ రాఘవరావు (ప్రకాష్ రాజ్) కి సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేక స్టేజి షోల ద్వారా లెజెండరీ నటుడుగా పేరు తెచ్చుకొని విశిష్ట గుర్తింపును తెచ్చుకుంటాడు. అయితే వయసు పైబడేసరికి నాటకాల నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అలా రిటైర్ అయిపోయాక తన మిగిలిన జీవితాన్ని భార్య, ఇద్దరు పిల్లలతో గడపాలనుకుంటాడు. అయితే ఈ క్రమంలో రాఘవరావు అతని భార్య, కొడుకు, కూతురు నుండి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో వారి సొంత ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటారు. మరి రాఘవరావు, అతని భార్య ఇంతకీ సొంత ఊరికి వెళ్లారా? చివరికి అందరూ కలిశారా లేదా అనేదే మిగతా కథ.
Advertisement
రంగమార్తాండ రాఘవరావు పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించేశారు. చాలా రోజుల తర్వాత మళ్లీ తన నట విశ్వరూపాన్ని చూపించారు. భార్య డైలాగ్ లను కూడా అలవోకగా పలుకుతూ తన అనుభవాన్ని చూపించారు. అలాగే రాఘవరావు భార్య పాత్రలో నటించిన రమ్యకృష్ణ తన పాత్రకు న్యాయం చేసింది. కళ్లతోనే ఎమోషన్స్ ని పండిస్తూ అద్భుతమైన నటన కనబరిచింది. ఇక రాఘవరావు స్నేహితుడు చక్రపాణి పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు రెగ్యులర్ గా చేసే కామెడీ పాత్రలో కాకుండా చాలా బరువైన చక్రపాణి పాత్రలోకి పరాకాయ ప్రవేశం చేసి నట విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో బ్రహ్మానందం గారి నటన థియేటర్లో ప్రతి ఒక్కరిని కనురెప్ప వెయ్యనివ్వకుండా కట్టిపడేస్తుంది. ఇక మిగతా పాత్రలో నటించిన ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆలీ రెజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్ తమ పాత్రల పరిధి మేర నటించారు.
ప్లస్ పాయింట్స్:
ప్రకాష్ రాజ్
కథ
మ్యూజిక్
సెంటిమెంట్
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
సాగదీత
రేటింగ్: 2.75/5
Read also: ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేసేది అందుకేనా ? కర్మ ఫలితం, సమయం విలువ ఏమిటంటే ?