Advertisement
Rangamarthanda Review: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజ నటులు కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే అందరిని ఆకట్టుకుని మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మరి నేడు మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Advertisement
Read also: తారకరత్న ని సొంత బంధువులే అంతలా ఇబ్బంది పెట్టారా ?
రంగమార్తాండ రాఘవరావు (ప్రకాష్ రాజ్) కి సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేక స్టేజి షోల ద్వారా లెజెండరీ నటుడుగా పేరు తెచ్చుకొని విశిష్ట గుర్తింపును తెచ్చుకుంటాడు. అయితే వయసు పైబడేసరికి నాటకాల నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అలా రిటైర్ అయిపోయాక తన మిగిలిన జీవితాన్ని భార్య, ఇద్దరు పిల్లలతో గడపాలనుకుంటాడు. అయితే ఈ క్రమంలో రాఘవరావు అతని భార్య, కొడుకు, కూతురు నుండి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో వారి సొంత ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటారు. మరి రాఘవరావు, అతని భార్య ఇంతకీ సొంత ఊరికి వెళ్లారా? చివరికి అందరూ కలిశారా లేదా అనేదే మిగతా కథ. కారల్ మార్క్స్ చెప్పిన మాటలకు అర్దం పడుతుంది “రంగమార్తాండ” సినిమా. నర్తనశాలే నిలయమైన ఒక నటుడు కథను, వ్యథను హృదయాన్ని కదిలించగలిగేలా చెప్పి సక్సెస్ అయ్యాడు కృష్ణవంశీ.
Advertisement
Read also: ఉగాది పండుగని జరుపుకోవటానికి వెనక కారణం ఏంటో తెలుసా ?
ఈ సినిమా ఒక ఆల్చిప్ప అయితే, ఆ ఆల్చిప్పలో అనేక ఆణిముత్యాలను పొందుపరిచాడు దర్శకుడు కృష్ణవంశీ. ముళ్ళపూడి వెంకటరమణ, త్రిపురనేని గోపీచంద్, వేటూరి సుందర రామమూర్తి వంటి ప్రముఖులు చెప్పిన మాటలు కథనుగుణంగా వినిపించిన సందర్భాలలో కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం. ఇప్పటివరకు మనం ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లాంటి గొప్ప నటులను చూసాం. వాళ్ళు చాలా సినిమాల్లో జీవించారు అని చెప్పుకున్నాం. కానీ రంగమార్తాండ సినిమా ప్రస్తావనకి వస్తే రంగమార్తాండ రాఘవరావు (ప్రకాష్ రాజ్), చక్రపాణి (బ్రహ్మానందం) పాత్రలలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం లాంటి హాస్య నటుడితో కూడా ప్రేక్షకుడిని ఏడిపించవచ్చు అని నిరూపించిన కృష్ణవంశీ సాహసం హర్షించదగ్గది. సినిమాకు ఇళయరాజా ఆరోప్రాణం.
Read also: ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేసేది అందుకేనా ? కర్మ ఫలితం, సమయం విలువ ఏమిటంటే ?