Advertisement
అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. వైసీపీని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారు. ఆ పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు. కత్తి మండలంలోని తన నివాసంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా వైసీపీ అవమానించిందని వరప్రసాద్ అన్నారు. రాజోలులో కష్టపడి పని చేసినా టికెట్ ఇవ్వలేదని అన్నారు. తనపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యరావుకి టికెట్ ఇచ్చారని ఇష్టం లేకపోయినా పెద్దలు సూచన మేరకు ఎంపీగా పోటీ చేశానని అన్నారు.
Advertisement
ఈ నేపథ్యంలో తాను వైసీపీతో తగదెంపులు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలోనే మరో పార్టీలో చేరుతానని ప్రకటించారు. ఏ పార్టీలో అనే విషయం చెప్పలేదు. జనసేన నేతలు, కార్యకర్తలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో రాపాక జనసేన పార్టీ తరఫున రాజోలు ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. తర్వాత పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు.
Advertisement
Also read:
Also read:
జనసేన పార్టీ బలపడేది కాదు. ఏదో గాలిపటంలా తాను ఒక్కడినే గెలిచా అని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో జరిగిన జనసేన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ వేదికపై కనపడటంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు గెలిచిన పార్టీని కాదని వెళ్లి పవన్ పైన విమర్శలు చేసిన ఆయన తిరిగి పార్టీ సమావేశానికి ఎలా వస్తారు అని నిలదీశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!