• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 01.09.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 01.09.2022

Published on September 1, 2022 by Bunty Saikiran

Advertisement

Rashi Phalalu in Telugu ఈ రోజు రాశి ఫలాలు 1.09.2022: రాశి ఫలాలు.. మానవ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రస్తుతం కాలంలో.. ఈ రాశిఫలాలకు డిమాండ్‌ భారీగానే పెరిగిపోయింది. గతంలో వీటిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మేటు వంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అయితే.. ఇవాళ గురు వారం రోజు. ఇవాళ్టి రోజున ఏఏ రాశుల వారికి… ఏం జరుగుతుందో వారి రాశుల ప్రకారం చూద్దాం.

మేషం :- టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి సహకరిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.

వృషభం :- సంగీత, సాహిత్య, కళారంగాల్లో వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడే వారు అధికమవుతున్నారని గమనించండి.

మిథునం :- వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారితో మెళకువ అసవరం. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయత్నం ఫలిస్తుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం.

కర్కాటకం :- ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బంది తప్పక పోవచ్చు. దూర ప్రయాణాలు చేస్తారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. వాతావరణంలో మార్పు వల్ల చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం అవుతాయి.

సింహం :- బంధుమిత్రుల కలయికతో మీలో నూతన ఉత్సాహం నెలకొంటుంది. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ముఖ్య విషయాల్లో బంధు మిత్రుల నుండి వ్యతిరేకత తలెత్తే ఆస్కారం ఉంది. అనుకున్న పనులు కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికి సకాలంలో పూర్తిచేస్తారు.

కన్య :- ఆర్థిక విషయాల్లో అనుకున్నంత సంతృప్తి. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబాభివృద్ధికై మీరు చేసే యత్నాలు ఫలిస్తాయి. ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. విద్యార్థులు తమ లక్ష్యం సాధించటానికి అధిక కృషి చేయవలసి ఉంటుంది. ఒకలేఖ మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.

Advertisement

తుల :- వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ జీవితభాగస్వామిలో మార్పు మీకెంతో ఊరటనిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయ గలుగుతారు. భూవివాదాలు, స్థిరాస్తి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి.

వృశ్చికం :- ఉద్యోగస్తులు అధికారుతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. వృత్తివ్యాపారులకు శుభదాయకం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ముఖ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు.

ధనస్సు :- ఇతరుల విషయాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. అథ్యాత్మిక చింతన పెరుగుతుంది. విశ్రాంతి లోపము వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. వృత్తివ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు.

మకరం :- వ్యాపారాభివృద్ధికి నూతన యత్నాలు మొదలెడతారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికం. ఉపాధ్యాయులకు ఆరోగ్య భంగం, ప్రశాంతత లోపం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలించవు. కొంత మంది మిమ్మల్ని మధ్యవర్తిత్వం వహించని కోరతారు.

కుంభం :- నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో అప్రమత్తత అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

Advertisement

మీనం :- ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు మాటపడవలసి వస్తుంది. ఆత్మీయులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించాలి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd