• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 07.07.2022

Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 07.07.2022

Published on July 7, 2022 by Bunty Saikiran

Advertisement

ఇవాళ జూలై 07  గురువారం. ధనస్సు రాశి వారికి వ్యాపారంలో తగినంత శ్రద్ధ అవసరం. వృషభం వారికి ఉద్యోగం మారడానికి అలాగే పురోగతి చెందడానికి ఇది మంచి పరిణామం. వీటి వివరాలతో పాటు అన్ని రాశుల వారీగా దినఫలం ఎలాగ ఉందంటే…

మేషం :- సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. దూరప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Also Read: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యూనిరేషన్స్ ఎలా ఉన్నాయంటే ..!

వృషభం :- విందు, వినోదాలలో చురుకుగా పాల్గొనే అవకాశం కలదు. ఖర్చులకు తగిన విధంగా సంయమనం పాటించండి. గతంలో వాయిదా పడిన పనులు మరల ప్రయత్నించుట వలన ముందుకు సాగును. పెద్దల సహకారం లోపిస్తుంది. వ్యాపార విస్తరణకు ఇది తగిన సమయం కాదు. కీలక నిర్ణయాలు వాయిదా వేయండి.

మిథునం :- చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలో ఖర్చులు అంచనాలు మించుతాయి. ఏదైనా అమ్మకానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. వాణిజ్య రంగాలలోని వారికి చురుకుదనం కానవస్తుంది. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు.

కర్కాటకం :- ఉద్యోగస్తులు మార్పులకైచేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు. కీలకమైన పత్రాల విషయంలో జాగ్రత్త పాటించాలి. కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రియతముల పట్ల, ముఖ్యల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. సన్నిహితుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

సింహం :- రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో అనందాన్ని ఇస్తుంది. బంధువులు వచ్చు సూచనలు కలవు. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల్లో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు.

Also Read:  Pakka Commercial Review: పక్కా కమర్షియల్ రివ్యూ

Advertisement

కన్య :- క్రొత్త రంగాలలోని ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక సంతృప్తి నిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాల్లో స్థిరత్వాన్ని పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి.

తుల :- ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సోదరీ సోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. ధనం బాగా ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మిత్రులతో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు.

వృశ్చికం :- వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. అనవసరమైన విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. స్థిరాస్తి, క్రయ విక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. ప్రలోభాలకు లొంగవద్దు. ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతో కాక, మీ సీనియర్ల సలహాలను తీసుకొని ముందుకు సాగండి.

ధనస్సు :- ఆర్థిక చెల్లింపులు, షాపింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. సమయానికి మిత్రులు సహకరించక పోవటంతో అసహనానికి గురవుతారు. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది.

మకరం :- ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు లేకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

కుంభం :- దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ఓ మంచి వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. దూరంలో వున్న వ్యక్తుల ఆరోగ్యం ఆవేదన కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ఇనుము, సిమెంట్, కలప వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి.

మీనం :- కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవగలవు. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వస్తుంది. అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే అన్వేషణ ఫలిస్తుంది. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభించగలదు.

ALSO READ : అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ?

Advertisement

Related posts:

Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 01.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 02.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 01.09.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 08.09.2022

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Nanam News. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Latest Posts

  • Ys. జగన్ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎప్పుడూ చూడని రేర్ ఫొటోస్..!!
  • భార్యను లాడ్జికి రప్పించి భర్త ఏం చేశాడో తెలుసా ?
  • పెళ్లి చేసుకునే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి ?
  • భార్య కోసం ఖండాలు దాటిన భర్త.. సైకిల్ పైనే స్వీడన్ కు..!
  • ఒక్క మిస్డ్ కాల్ అంత పని చేసిందా ? రెండు నిండు ప్రాణాలు..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd