• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 10.09.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 10.09.2022

Published on September 10, 2022 by Bunty Saikiran

Advertisement

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 10.09.2022: రాశి ఫలాలు.. మానవ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రస్తుతం కాలంలో.. ఈ రాశిఫలాలకు డిమాండ్‌ భారీగానే పెరిగిపోయింది. గతంలో వీటిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మేటు వంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అయితే.. ఇవాళ శని వారం రోజు. ఇవాళ్టి రోజున ఏఏ రాశుల వారికి… ఏం జరుగుతుందో వారి రాశుల ప్రకారం చూద్దాం.

మేషం :- బాకీలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి. నగదు చెల్లింపులు, స్వీకరణలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు అనుకూలం కాదు. కొత్త పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది.

వృషభం :- పత్రిక, వార్తా సంస్థలలోని వారికి తోటివారి వల్ల చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు లీవు, అడ్వాన్సులు మంజూరవుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది.

మిథునం :- స్త్రీల మనోవాంఛలు, అవసరాలు నెరవేరుతాయి. మీ ఆంతరంగి, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. పాతమిత్రులు, చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబలో కలతలు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి, ఎంతో కొంత పొదపు చేయాలన్న మీ యత్నం ఫలించదు.

కర్కాటకం :- పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. హామీలు, అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితుల అనుకూలతలు ఉంటాయి. పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు తిరిగి పొందుతారు.

సింహం :- బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారి టార్గెట్లు పూర్తి కాగలవు. స్త్రీలకు సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.

కన్య :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ప్రత్యర్ధులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కోర్టు వ్యవహరాలు, భూవివాదాలు చికాకు పరుస్తాయి.

Advertisement

తుల :- అనుకోని ఖర్చులు, చెల్లింపుల వల్ల ఇబ్బందులు తప్పవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. పోస్టల్, టెలిగ్రఫిక్ రంగాల వారికి సంతృప్తి నిస్తుంది. జాయింట్ వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు.

వృశ్చికం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. వాతావరణంలోని మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది.

ధనస్సు :- ఉద్యోగస్తులకు తోటివారి నుండి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థినులకు పాఠ్యాంశాల కంటే ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త పరిచయాలు వ్యాపకాలు ఉత్సాహం కలిగిస్తాయి. వాహన సౌఖ్యం, వస్తులాభం పొందుతారు. కొంతమంది మీ ఆలోచనలు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.

మకరం :- ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. కళ, క్రీడా రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది.

కుంభం :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఊహించని చికాకులు తలెత్తి తెలివితో పరిష్కరిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచన లుంటాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.

మీనం :- ప్రైవేటు సంస్థలలోని వారికి బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. ఊహించని చికాకులు తలెత్తి తెలివితో పరిష్కరిస్తారు. పోస్టల్,టెలిగ్రఫిక్ రంగాల వారికి సంతృప్తి నిస్తుంది. బంధువుల రాకవల్ల గృహంలో సందడి కానవస్తుంది.

Advertisement

READ ALSO : Brahmastra Review : ‘బ్రహ్మాస్త్ర’ రివ్యూ

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd