• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 13.08.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 13.08.2022

Published on August 13, 2022 by Bunty Saikiran

Advertisement

Rashi Phalalu in Telugu ఈ రోజు రాశి ఫలాలు 13.08.2022: ఇవాళ అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశిని వరిస్తుంది. వారి గ్రహస్థానాల మధ్య ఈ రోజు రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఇలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏం చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మేషం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు వాయిదా పడుట వల్ల నిరుత్సాహానికి గురౌతారు. స్త్రీలకు దైవ కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు తోటివారి వల్ల సమస్యలు తలెత్తవచ్చు.

 

వృషభం :- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. విద్య సంస్థలలో వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది.

మిథునం :- ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలుండవు. స్త్రీలకు బంధువర్గాల మాటతీరు ఆందోళన కలిగిస్తుంది. ఇంజనీరింగ్, మెడికల్, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. సోదరుల సహ్నితులను కలుసుకుంటారు.

కర్కాటకం :- రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. కాంట్రాక్టర్లకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. కుటుంబీకులతో ఎక్కువ సమయం గడపండి. విజయం మీ సొంతం అనిగుర్తించండి.

సింహం :- స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అప్పుడప్పుడు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. ఉచిత సలహా ఇచ్చి ఎదుటివారి ఉద్రేకానికి లోనుకాకండి.

Advertisement

కన్య :- వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. స్త్రీలకు షాపింగ్ లోను, పనివారల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. ఆలయాలను సందర్శిస్తారు. ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.

తుల :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి అవ్వడం కష్టము. మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూనె, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, బెల్లం, శనగలు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.

వృశ్చికం :- ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్తత అవసరం. పూర్వ మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. స్పెక్యులేషన్ కలిసిరాగలదు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. సినీరంగ పరిశ్రమల్లో వారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతుంది.

ధనస్సు :- ముఖ్యమైన పర్యటనలలో అవాంతరాలు ఎదురైనా జయం పొందుతారు. సమయాన్ని వృధా చేసే కొలది నష్టాలను ఎదుర్కుంటారు. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది.

మకరం :- ప్రముఖులతో పరిచయాలు మరింత బలపడతాయి. సమయానికి మిత్రుల సహకరించక పోవటంతో అసహానానికి గురవుతారు. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. బంధువుల రాకతో సందడి కానవస్తుంది. విద్యార్థులు వాహనం నడుపునపుడు ఏకాగ్రత చాలా అవసరం.

కుంభం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలకు ఆహార వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి. ఎప్పటి నుండో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. సామూహిక కార్యక్రమాలలోపాల్గొంటారు.

మీనం :- వ్యాపారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. రాజకీయాలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. సోదరీ, సోదరులు మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ వహిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే కానిపనులు నెరవేరవు.

Advertisement

Also Read: ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ? 

 

Latest Posts

  • డీజీపీ ఆఫీస్ ముట్టడించిన వారికి షాక్..!
  • క్రిటికల్ గానే తారకరత్న పరిస్థితి.. మెలేనాతో సతమతం.. ఏంటీ వ్యాధి?
  • వివేకా హత్యకేసు.. సీబీఐ దూకుడుతో మిస్టరీ వీడేనా?
  • ముందస్తు సవాల్.. బీజేపీ రియాక్షన్ ఏంటో..?
  • ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd