• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 12.07.2022

Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 12.07.2022

Published on July 12, 2022 by Bunty Saikiran

Advertisement

ఇవాళ మంగ‌ళ వారం. ఈ రోజున అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశిని వరిస్తుంది. వారి గ్రహస్థానాల మధ్య ఈరోజు రాసి చక్రంలోని 12 రాశుల వారికి ఇలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏం చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మేషం :- స్థిరాస్తి కొనుగోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడతాయి. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. ఉద్యోగ, వృత్తుల వారికి ఆశించిన పురోభివృద్ధి ఉండదు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. రావలసిన ధనం చేతికందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టుకు హజరవుతారు.

Read Also : టాలీవుడ్‌ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?

వృషభం :- రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీలో దయాగుణం వికసిస్తుంది. ధనాన్ని మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు.

మిథునం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు చుట్టు పక్కలవారితో విభేదాలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురైనా మొండి ధైర్యంతో శ్రమించి పూర్తి చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.

కర్కాటకం :- ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత, మెళుకువ చాలా అవసరం. ఉద్యోగస్తుల శ్రమను అధికారులు గుర్తిస్తారు. స్త్రీల తొందరపాటు నిర్ణాయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. విలువైన పత్రాలు చేజార్చుకుంటారు.

సింహం :- గృహంలో ఏవన్నా వస్తువులు పోవుటకు ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు అనుకూలం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి ముఖ్యుల సహకారం వలన సమసిపోతాయి.

Advertisement

కన్య :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.

తుల :- విద్యార్థుల పరిచయాలు మరింతగా బలపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల సలహా పాటిస్తారు. బ్యాంక్ పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులువాయిదా పడతాయి. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. రుణ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కుంటారు.

వృశ్చికం :- ముఖ్యమైన వ్యక్తుల కలయిక వల్ల మేలు జరుగుతుంది. పోస్టల్, టెలిగ్రాఫిక్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. గతంలోని వ్యక్తులు తారసపడతారు. ప్రేమికుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.

ధనస్సు :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందించుట వలన మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి. ఐరన్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. ప్రముఖులను కలుసుకుంటారు.

మకరం :- రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ లక్ష్యం నెరవేరదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.

కుంభం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకువేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం:- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ కోపాన్ని,చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మిత్రులనుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.

Advertisement

Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd