• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 17.07.2022

Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 17.07.2022

Published on July 17, 2022 by Bunty Saikiran

Advertisement

నేడు ఆదివారం… రోజున అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశిని వరిస్తుంది. వారి గ్రహస్థానాల మధ్య ఈ రోజు రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఇలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏం చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మేషం :- వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. దూరపు బంధువుల ప్రోత్సాహంతో పనులలో పురోభివృద్ధిని సాధిస్తారు. రాజకీయనాయకులు వివాదస్పదమైన వ్యాఖ్యానాలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు.

Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?

వృషభం :- స్థిరాస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. సోదరి, సోదరుల వ్యవహారాల్లో ఊహించని మార్పులు కానరాగలవు. మీరు ఉద్దేశ్య పూర్వాకంగా ఎవరినీ దూషించకపోయినా ఎదుటి వారి అపోహలకు లోనైయ్యే అవకాశం ఉంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

మిథునం :- మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగాలలో వారికి పనివారితో సమస్యలు తలెత్తగలవు. మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటన లెదురవుతాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం :- విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. మీ చిన్నారుల గురించి మంచి మంచి పథకాలు, ప్రణాళికలు వేస్తారు. మీ వ్యవహార జ్ఞానం, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీల తొందరపాటు నిర్ణయాలవల్ల ఇబ్బందులకు లోనవుతారు.

సింహం :- స్త్రీలకు పనిభారం అధికం. ఆహార, వ్యవహారాల్లోను, ఆరోగ్య విషయం లోను, చాలా మెళకువ అవసరం. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒకింత అసహనానికి గురవుతారు. ఎదుటివారిని గమనించి ఎత్తుకు పై ఎత్తు వేయండి.

కన్య :- సినిమా కళా కారులకు అపవాదులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీల అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఆత్మీయులను విమర్శించడం మంచిదికాదని గమనించండి. మీ అంతరంగిక విషయాలను బయటకు వ్యక్తం చేయకండి.

Advertisement

తుల :- ఉమ్మడి వ్యవహారాలు, ఆస్తి పంపకాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. మిత్రులవల్ల అపనిందలు, అపవాదులు ఎదుర్కొంటారు. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. నూతన పరిచయాలు, వ్యాపకాలు మీ పురోభివృద్ధికి నాందీ పలుకుతాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.

వృశ్చికం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. నిగ్రహం పాటించటం క్షేమదాయకం. వాహనం, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.

ధనస్సు :- కొంతమంది మిమ్ములను ఉద్రేకపరిచేలా సంభాషిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. రుణ, విదేశీయాన యత్నాల్లో ఆటంకాలెదుర్కుంటారు. కుటుంబ వ్యవహారాలలో కానీ శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. మతపమైన విషయాలపట్ల ఏకాగ్రత వహిస్తారు.

మకరం :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. బంధువులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. రాజకీయనాయకులు తరుచు సభలు, యూనియన్ సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి.

కుంభం :- ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక కోసం అధిక సమయం వెచ్చిస్తారు.

మీనం :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభావిస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Advertisement

Read Also : టాలీవుడ్‌ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd