Ads
Actor Raghuvaran Son name, images, Latest Photos: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది విలన్స్ వచ్చారు. అందులో ప్రముఖ నటుడు రఘువరన్ ది ప్రత్యేక పాత్ర. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్నారు. పసివాడి ప్రాణం, శివ వంటి సినిమాల్లో విలన్ గా, అంజలి వంటి క్లాసిక్ మూవీలో తండ్రిగా అద్భుతం నటనను కనబరిచారు. ఆయన మొదట్లో హీరోగా, తర్వాత విలన్ గా, చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఏ తరహా పాత్ర వేసిన ఆ పాత్రలో ఇమిడిపోయి మెప్పించగలిగాడు.

Actor Raghuvaran Son
రఘువరన్ గారు ఫేడ్ అవుట్ అవుతున్న క్రమంలో ప్రకాష్ రాజు లాంటి కొత్త విలన్ వచ్చారు. దీంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. దీంతో మందుకు బానిసై కాలేయం దెబ్బతింది. ఆ ఎఫెక్ట్ ఇతర అవయవాల మీద కూడా పడింది. దాంతో ఆయనకు 50 ఏళ్లు నిండకముందే నూరేళ్లు నిండిపోయాయి. రఘువరన్, రోహిణి గార్లకు బాబు రిషి వరన్ పుట్టారు. రఘువరన్ నిజానికి మంచి సంగీత కారుడు, గాయకుడు కూడా అని ఆయన భార్య రోహిణి గారు చెప్పారు.
Advertisement

Actor Raghuvaran Son
కానీ వాటి మీద దృష్టి పెట్టమంటే నేను మల్టీ టాస్కింగ్ చేయలేను. నటనలో ఉంటూ మిగతా వాటిపై దృష్టి పెట్టలేను అనే వారట. కానీ చనిపోయే కొన్ని రోజుల ముందు ఆయన కొన్ని పాటలు పాడి వీడియో తీశారు. వాటిని నేను సేకరించి ఈ మధ్య వీడియో ఆల్బమ్ గా తయారు చేశాను. దాన్ని రజనీకాంత్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసమే మా అబ్బాయి రిషి తొలిసారి మీడియా ముందుకు వచ్చారు అంటూ రోహిణి చెప్పుకొచ్చింది. రఘువరన్ కొడుకు అమెరికాలో ప్రీమియర్ డిగ్రీ చదువుతున్నట్లుగా రోహిణి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?