• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 20.08.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 20.08.2022

Published on August 20, 2022 by Bunty Saikiran

Advertisement

Rashi Phalalu in Telugu ఈ రోజు రాశి ఫలాలు 20.08.2022: రాశి ఫలాలు.. మానవ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రస్తుతం కాలంలో.. ఈ రాశిఫలాలకు డిమాండ్‌ భారీగానే పెరిగిపోయింది. గతంలో వీటిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మేటు వంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అయితే.. ఇవాళ శని వారం రోజు. ఇవాళ్టి రోజున ఏఏ రాశుల వారికి… ఏం జరుగుతుందో వారి రాశుల ప్రకారం చూద్దాం.

మేషం :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు అనుభవం గడిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాల జోలికి పోవటం మంచిది కాదు. ఖర్చులు పెరిగినా ధనానికి లోటుండదు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం సంతృప్తినిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది.

ఇవి కూడా చదవండి:  గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేష్ బాబు చెల్లెలు !

వృషభం :- భాగస్వామిక చర్చలు, సంప్రదింపులు ఫలిస్తాయి. స్త్రీలకు బంధువులు, పొరుగువారితో సఖ్యత నెలకొంటుంది. మీ సంతానానికి కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. పెద్దలకు ఆరోగ్య భంగం, వైద్య పరీక్షలు అవసరమవుతాయి. కుటుంబీకుల ధోరణి చికాకు కలిగిస్తుంది. విద్యార్థులు క్రీడ, క్విజ్ పోటీల్లో విజయం సాధిస్తారు.

మిథునం :- మీ మాటకు అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతలు, కిందిస్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు.

కర్కాటకం :- పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. నూతన ప్రయోగాలు, సాహసకృత్యాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తి, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉపాధ్యాయుల శ్రమకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. సేవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.

సింహం :- మీ సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఆహార, ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. మీరెంతగానో ఆందోళన చెందిన ఒక సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రయోజనమైన ఖర్చులే ఉంటాయి.

కన్య :- వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధికమిస్తారు. బదిలీపై వచ్చిన ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సఫలీకృతులవుతారు. స్త్రీలకు అయిన వారి ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. వాహనం నిదానంగా నడపటం మంచిది.

Advertisement

తుల :- విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కళ, క్రీడ, సాంకేతిక రంగాలవారికి ప్రోత్సాహకరం. కుటుంబీకుల కోసం బాగా శ్రమిస్తారు. ధనమూలకంగా సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి ఇబ్బందులెదుర్కుంటారు.

వృశ్చికం :- ఉద్యోగస్తులు, అధికారులు ధనప్రలోభానికి దూరంగా ఉండటం మంచిది. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కార ఉంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. సంతకాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత వహించండి.

ధనస్సు : – మీ అభిప్రాయాలు, పథకాలు గోప్యంగా ఉంచండి. కొన్ని విషయాల్లో మీ ఊహలు, అంచనాలు నిజమవుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. చక్కని ఆలోచనలు, మంచి ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు.

మకరం :- దైవ, సేవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు, నూతన పెట్టుబడుల విషయంలో ఏకాగ్రత ముఖ్యం. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.

కుంభం :- బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త. గత సంఘటనలుపదేపదే జ్ఞప్తికి వస్తాయి. ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందిస్తారు. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించటం మంచిది. దేనియందు ఏకాగ్రత అంతగా ఉండదు.

మీనం :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది.

Advertisement

ఇవి కూడా చదవండి: 1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd