Ads
ఒక్క సినిమా హిట్ అయితే రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అయ్యవారి ఇంటిముందు దర్శక నిర్మాతలు క్యూ కట్టాల్సిందే. అడిగినంత ఇవ్వాల్సిందే. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది పారితోషికాలు పదేళ్లలో పదింతలు పెరిగాయి. హీరోలు కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో పాటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గట్లేదు.
ఇవి కూడా చదవండి: Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 20.08.2022
అయితే 1990 వ దశకం నుంచి క్రమక్రమంగా హీరోల రెమ్యూనరేషన్లు పెరిగిపోతూ వచ్చాయని సమాచారం. ప్రస్తుతం ఉన్న హీరోలు కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకుంటే అప్పటి స్టార్ హీరోలు ఎంత తీసుకున్నారో ఒకసారి చూద్దామా.
ఇవి కూడా చదవండి: చాణక్య నీతి: ఈ పని చేస్తే శత్రువులైన నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే..!!
తెలుగు ఇండస్ట్రీ మూల పురుషుడు ఎన్టీఆర్ అప్పట్లో సినిమా చేయాలంటే 40 లక్షలు బడ్జెట్ లో ఉండేదంట. ఆ సినిమాని సెట్స్ వేసి, కాస్త భారీగా తీయాలంటే మరో 10 లక్షల వరకు అయ్యేదంట. ఇక అందుకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ 12 లక్షల వరకు ఉండేదని సమాచారం. ఆయన పారితోషికం లాగే సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, అప్పట్లోనే కోటి నుంచి 3 కోట్ల వరకు వసూలు రాబట్టేవని సమాచారం.
Advertisement
అలాగే ఇండస్ట్రీకి మరో మూలపురుషుడు ఏఎన్ఆర్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన సాంఘిక సినిమాలకు బడ్జెట్ 30 కోట్లు ఉండగా ఏఎన్ఆర్ రెమ్యూనరేషన్ 10 లక్షలు తీసుకునేవారంట. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండేవారని సమాచారం. ఇక ఆయన సినిమా బడ్జెట్ 20 నుంచి 25 లక్షల వరకు ఉంటే అందులో ఆయన 7 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారంట.
అయితే కృష్ణ తన సినిమా ఫ్లాప్ అయ్యి, నిర్మాతలకు నష్టాలు వస్తే వెంటనే అదే నిర్మాతలకు కృష్ణ డేట్లు ఇచ్చి మరో సినిమా చేసి పెట్టే వారిని చెబుతుంటారు. అంతేకాక కృష్ణ నీ నిర్మాత, హీరో అని కూడా అంటూ ఉండేవారు. ఇక వెండితెర సోగ్గాడు శోభన్ బాబు సినిమా బడ్జెట్ 20 లక్షలు అయితే అందులో 6-7 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకునేవారని సమాచారం.
ఇవి కూడా చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేష్ బాబు చెల్లెలు !