Advertisement
Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు…మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.
Advertisement
మేషం :- సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థినులు ప్రేమ, అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆసరాగా నిలుస్తారు.
Today Horoscope in Telugu 2022
వృషభం :- మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. జాయింట్ వెంచర్లు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం.
మిథునం :- స్థిరచరాస్తుల మూలక ధనం అందుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
కర్కాటకం :- సేవ, పుణ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. భార్యా, భర్తల మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. గృహం ఏర్పరుచుకోవాలనే కోరిక బలపడుతుంది. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, కార్మికులతో చికాకులు వంటివి ఎదుర్కొంటారు.
సింహం :- ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పుతో పనిచేయవలసి ఉంటుంది. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలించవు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఉద్యోగ విరమణచేసే వారి ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్త్రీలకు అలంకారాలు, అలంకరణల పట్ల మక్కువ పెరుగుతుంది.
కన్య :- వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. పెద్దమొత్తంలో ధనసహాయం, హామీల వంటి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
Advertisement
తుల :- ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు సమస్యలకు దారితీస్తాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆందోళన, చికాకులు తప్పవు. సిమెంటు, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి. భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసివస్తుంది.
వృశ్చికం :- ధనసహాయం, హామీల విషయంలో పునరాలోచన అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
ధనస్సు :- రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం నెరవేరగలదు. సాహస ప్రయత్నాలు విరమించండి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం ఉత్తమమని గమనించండి. స్త్రీలకు ఆత్మీయులు అండగా నిలుస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. పుణ్య, సేవా శుభకార్యాల్లో పాల్గొంటారు.
మకరం :- కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత, జాప్యం వంటి చికాకులు తప్పవు. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మొండి బకాయిలు వసూలు కాగలవు. వృత్తి వ్యాపారులకు ఆశాజనకం. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
కుంభం :- ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి. దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది. కీలకమైన వ్యవహరాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం :- మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. సన్నిహితులు మీ యత్నాలకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి.
Read also: హీరోయిన్ లేకుండానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమాలు ఏవంటే…?