Advertisement
Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు…మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.
Advertisement
మేషం :- పాత వస్తువులనుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు చేయుటలో విజయం సాధించ గలుగుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువులను కలుసుకుంటారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
వృషభం :- కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు. సమయానుకూలంగా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. నూతన దంపతులకు సంతాన యోగం. మీరు చేసే పనికి ఫలితం మరోరకంగా ఉండే అవకాశం ఉంటుంది.
మిథునం :- అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
కర్కాటకం :- ఏసీ కూలర్లు మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవచ్చును. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు.
సింహం :- పెంపుడు జంతువులు గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించటం వల్ల ఒక వ్యవహారం మీకు సానుకూలమవుతుంది. ఆకస్మిక ఖర్చుల వల్ల ధనం చేతిలో నిలబడటంకష్టం. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
కన్య :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత వహించండి. వీరికి దూరప్రాంతాలలో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. తరుచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రుణదాతల నుండి ఒత్తిడి అధికమువుతుంది. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది.
Advertisement
తుల :- ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికివస్తాయి. రిప్రజెంటేటివ్లకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపార రంగాల్లో వారికి తోటివారి వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచిది కాదని గమనించండి.
వృశ్చికం :- మీ శ్రీమతి సూటిపోటి మాటలు, మొండితనం చికాకు కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామిక సమావేశాల్లో మీ నిర్ణయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు ఏకరువు పెట్టటం మంచిది కాదని గ్రహించండి.
ధనస్సు :- ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్ధవంతంగా పరిష్కరిస్తారు. బంధువర్గాల నుండి విమర్శలు మాటపట్టింపులు ఎదురయ్యే అవకాశం ఉంది మెళకువ వహించండి. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. కొన్ని పనులు చివరిలో వాయిదా వేస్తారు.
మకరం :- ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి.
కుంభం :- సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. తలపెట్టిన పనులలో ఇబ్బందులు తలెత్తినానెమ్మదిగా సమసిపోతాయి. రాజకీయ కళా రంగాలవారికి ఒత్తిడి అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
మీనం :- రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు ఆందోళనలు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యంగా ఉండగలదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి.
Read also: RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్