• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 24.01. 2023

Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 24.01. 2023

Published on January 24, 2023 by karthik

Advertisement

Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు… మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.

మేషం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో ఆసక్తి, ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రేమికుల తొందరపాటు తనం వల్ల ఇబ్బందులకు గురవుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభాదాయకం.

Today Horoscope in Telugu 2022

Today Horoscope in Telugu 2022

వృషభం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. రావలసిన ధనం అందుతుంది. కోర్టు వ్యవహారాలలో మీ అభిప్రాయాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచండి. వాక్చాతుర్యంతో వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు వాహనం నడుపేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.

మిథునం :- కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు ఎదురుకావచ్చు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ వేతన సమస్యలు వంటివి ఏర్పడతాయి. ప్రత్యర్థులు మీ శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తారు. పూలు, కొబ్బరి, పండ్ల వ్యాపారులకు అనుకూలం. పరిశోధనల విషయాలపై దృష్టి సారిస్తారు.

కర్కాటకం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనోధైర్యంతో మీ యత్నాలు కొనసాగించండి. స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పాతబాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.

సింహం :- గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. బ్రోకర్లకు, కమీషన్ ఏజెంట్లకు కలిసివచ్చేకాలం. కృషి రంగానికి అవసరమైన వస్తువులు రవాణా చేసుకుంటారు. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సమర్థతకు తగిన సదావకాశాలు లభిస్తాయి. మిమ్మల్ని ఉద్రేకపరచి లబ్దిపొందటానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త వహించండి.

కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. బ్యాంకు డిపాజిట్లు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మానిగ్రహంతో వ్యవహరించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి.

Advertisement

తుల :- వ్యాపారంలో అనుభవం, లాభాలు గడిస్తారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. స్త్రీలు పరిచయం లేని వ్యక్తులతో మితంగా మాట్లాడం మంచిది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి.

వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నములలో ఉన్న వారికి శుభఫలితములను పొందుతారు. ధనం కంటే మీ ఆత్మగౌరవానికే విలునిస్తారు. ప్రియతములతో విరామ కాలక్షేపాలలో పాల్గోంటారు. స్థిరాస్థిని కొనుగోలు చేయు యత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి.

ధనస్సు :- భాగస్వామ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. మిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. నిర్మాణాత్మకమైన పనులలో చురుకుదనం కనిపిస్తుంది. ఇతరుల వాహనం నడపటం వల్ల ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

మకరం :- రుణాలు తీర్చగలుగుతారు. శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. పారిశ్రామిక రంగాల వారికి అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదురవుతాయి. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.

కుంభం :- క్రీడ, కళారంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పవు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ప్రయాణాలలో చికాకులు వంటివి తలెత్తుతాయి. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై ప్రయత్నిస్తారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి.

Advertisement

మీనం :- మీ ఆశయసాధనకు ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారం లభిస్తుంది. ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోగలవు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Latest Posts

  • ముందస్తు సవాల్.. బీజేపీ రియాక్షన్ ఏంటో..?
  • ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!
  • అనసపండు ఆరోగ్యానికి రక్ష.. ఇన్ని సమస్యలకు చెక్..!!
  • పవన్ ఫ్యాన్స్ కి పండగే పండగ.. మరో క్రేజీ చిత్రంలో పవన్..!!
  • ఈ జంతువులను కలలో చూస్తే చాలా అదృష్టం..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd