Advertisement
Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు…మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.
Advertisement
మేషం :- చేతివృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. దైవ, సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంగారు, వెండి, వస్త్ర వ్యాపార రంగాల వారికి మెళకువ అవసరం. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.
వృషభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోనివారికి మార్పులు అనుకూలిస్తాయి. బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయంలో దూకుడు మంచిదికాదు.
మిథునం :- ఎల్.ఐ.సి ఏజెంట్లకు, బ్రోకర్లకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలమవుతాయ. విద్యార్థులకు సంతృప్తి కానవస్తుంది.
కర్కాటకం :- ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు అయిన వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి అధికం. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులలో వ్యయం అధికమవుతుంది.
సింహం :- ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. విదేశీ వ్యవహారాలు, విద్య, రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాల వారు ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం అందటంతో మానసికంగా కుదుటపడతారు.
కన్య :- ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. కొత్త పనులు ప్రారంభిచడంలో అడ్డంకులు ఎదురవుతాయి.
Advertisement
తుల :- బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఉమ్మడి కుటుంబ విషయాలలో మాట పడాల్సి వస్తుంది. మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం యత్నిస్తారు.
వృశ్చికం :- దూర ప్రయాణాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. బీమా, పెన్షన్, వ్యవహారాలు క్రయ విక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. దైవ సేవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తితో పాటు ధనం అధికంగా వెచ్చిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు.
ధనస్సు :- ఆర్థిక విషయాల్లో ఒడిదొడుకులు వ్యవహరిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
మకరం :- శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. లాయర్లకు చికాకులు తప్పవు. ఆడిటర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒకే కాలంలో అనేకపనులు చేపట్టుట వల్ల దేనిలోనూ ఏకాగ్రత వహించలేరు. ఇతరులు దైవ సేవాకార్యక్రమాలలో మీ పట్ల ఆకర్షితులౌతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు.
కుంభం :- మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. సహకార సంఘాలలో వారికి రాజకీయాలలో వారికి చికాకు తప్పదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వృత్తుల వారికి సదావకాశాలు, ప్రజాసంబంధాలు బలపడతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు.
మీనం :- స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. దీర్ఘకాలిక రుణాలను తీర్చి ఊపిరి పీల్చుకుంటారు. బంధు మిత్రులతో పట్టింపులెదుర్కొంటారు. పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ సంస్థల్లో వారికి ఆశించినంత గుర్తింపు లభించదు. స్త్రీలకు రచనలు, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
READ ALSO : ఖతర్ పాపకు కొత్త కష్టం.దేవుడా ఇది అస్సలు ఊహించలే ! ఈసారి ఏమయ్యిందంటే ?