• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 23.12.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 23.12.2022

Published on December 23, 2022 by karthik

Advertisement

Rashi Phalalu in Telugu 2022 : నేటి రాశి ఫలాలు… మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.

 

మేషం :- స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు వ్యవహరాలు ముందుకుసాగక నిరుత్సాహం చెందుతారు. ప్రైవేట్ ఫైనాన్సులలో మదుపు క్షేమం కాదు. పాత మొండిబాకీలు వసూలవుతాయి.

Today Horoscope in Telugu 2022

Today Horoscope in Telugu 2022

వృషభం :- పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించడం మంచిది. డాక్టర్లు శస్త్రచికిత్సలో విజయాన్ని సాధిస్తారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ప్రయాణాలలో వస్తువులు పోయే ఆస్కారం వుందిజాగ్రత్త వహించండి.

మిథునం :- స్త్రీలు టీ.వి కార్య క్రమాలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. నిరుద్యోగులు బద్దకాన్ని వదలి చురుగ్గా ఉండండి. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. హామీలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం :- విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. రాజకీయనాయకులు సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. సోదరీ, సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ఊహగానాలతోకాలం వ్యర్ధం చేయక సతాకాలంను సద్వినియోగం చేసుకోండి.

సింహం :- పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి రానవస్తుంది. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. వైద్య రంగాల వారికి ఏకాగ్రత చాలా అవసరం. ప్రముఖుల సహకారంతో కొన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కారం కాగలవు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.

కన్య :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. వృధా ఖర్చులు అదుపుచేయాలన్న మీ యత్నం నెరవేరదు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి తప్పదు. ప్రకటనలు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దైవకార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి.

Advertisement

తుల :- స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక నేరవేరుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చిఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. మొహమ్మాటాలు, ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురి కావలసివస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు.

వృశ్చికం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వెచ్చిస్తారు. స్త్రీలకు అకాలభోజనం, శ్రమాధిక్తవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం విరమించు కోవటం శ్రేయస్కరం.

ధనస్సు :- చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతోచికాకు, ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. రేషన్ డీలర్లు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల వేధింపులు అధికం. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి.

మకరం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాలి. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. మొండి బాకీల వసూలుకు ఒకటికి రెండుసార్లు తిరగవలసి ఉంటుంది. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు.


కుంభం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. ఆత్మవిశ్వసం రెట్టింపవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.

మీనం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో ఏకాగ్రత, మెళుకువ చాల అవసరం. విలువైన వస్తు కొనుగోళ్ళలో స్త్రీలకు అవగాహన ముఖ్యం. చిన్న చిన్న తప్పిదాలు దొర్లే సూచనలున్నాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Advertisement

Also Read: మోడరన్ టాయిలెట్ లో రెండు ఫ్లష్ బటన్స్ ఉంటాయి.. మీరెప్పుడైనా గమనించారా..? ఎందుకో తెలుసా..?

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd