• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 26.06.2022

Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 26.06.2022

Published on June 26, 2022 by Bunty Saikiran

Advertisement

జూన్ 26 వ తేదీ ఆదివారం నాడు చంద్రు తులారాశి నుంచి వృశ్చికంలో ప్రవేశించనున్నాడు. ఈ రోజున శుక్రుడు మిధునం నుంచి చంద్రుడి రాశి అయిన కర్కాటకంలో కి ప్రదర్శిస్తున్నాడు. ఈ రెండు శుభగ్రహాల మార్పుతో పాటు చంద్రుడు అలాగే గురు శిష్యుల యోగాన్ని సృష్టించడం వల్ల ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేషం నుండి మీనం వరకు నేటి దిన ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

మేషం :- కుటుంబీకులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరులతో మనస్పర్థలు తలెత్తుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి.

వృషభం :- నిర్వహణ లోపం వల్ల వ్యాపార రంగంలోని వారికి సమస్యలు తలత్తే ఆస్కారం ఉంది. ధనం ఎంత వస్తున్నా నిల్వ చేయలేకపోతారు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిదికాదు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.

 

మిథునం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.

రాశిచక్ర అంచనాలు

కర్కాటకం

కర్కాటకం :- సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య సంతానం విద్యా విషయాలు ప్రస్తావనకు వస్తాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. తలచిన కార్యక్రమాలు, వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అసలైన శక్తిసామర్థ్యాన్ని మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది.

 

సింహం :- వ్యాపారాభివృద్ధికి ఆర్థిక సంస్థల నుంచి రుణం మంజూరవుతుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ప్రియతములతో సంభంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. స్త్రీలు అదనపు సంపాదన దిశగా తమ ఆలోచనలు సాగిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులను కలుసుకుంటారు.

Advertisement

 

కన్య :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

 

తుల :- ఆకాల భోజనం వల్ల పెద్దల ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.

 

వృశ్చికం :- స్త్రీలకు ఆత్మీయుల కలయిక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి చికాకులు వంటివి తలెత్తుతాయి. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. బంధువుల రాక పోకలు చికాకు పరుస్తాయి. విద్యార్థినులకు ఉన్నత విద్యలలో అవకాశం లభిస్తుంది.

 

ధనస్సు :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పనిభారం అధికమవుతుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది.

 

మకరం :- ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి.

 

కుంభం :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు.

 

మీనం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.

Advertisement

also read;

చైనా ఎందుకు క్రికెట్ ఆడటం లేదు.. దానికి గల కారణాలేంటి..?

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd