• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 24.08.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 24.08.2022

Published on August 24, 2022 by Bunty Saikiran

Advertisement

మేషం :- ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉన్నత విద్యా, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలలో ఇబ్బందులు తలెత్తుతాయి.


వృషభం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శ్రమాధిక్యత కానవచ్చిన సత్ఫలితాలు పొంద గులుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్పెక్యులేషన్ లాభదాయకం. రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలు షాపింగ్, విందు వినోదాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యం.

మిథునం :- ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. ఖర్చులు, అవసరాలు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. విద్యార్థులకు సన్నిహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి.

కర్కాటకం :- ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సమయానికి మిత్రులు సహకరించకపోవటంతో అసహనానికి గురవుతారు. మార్కెటింగ్, ప్రైవేటు, పత్రికా రంగంలోనివారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్థిర బుద్ది లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు.

సింహం :- చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఐరన్, సిమెంటు, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకం. స్వతంత్ర్య నిర్ణయాలు చేసుకొనుట వలన శుభం చేకూర గలదు.

కన్య :- స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందుకెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికమతున్నారని గమనించండి.

Advertisement

తుల :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. పెద్దల ఆరోగ్యములో శ్రద్ధ వహించండి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం.

వృశ్చికం :- రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. కార్మికులకు, తాపీ పనివారికి సమస్యలు తప్పవు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. స్త్రీలు పనివారితో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విదేశీయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు.

ధనస్సు :- బ్యాంకింగ్ వ్యవహారాలలోను, ప్రయాణాలలోను అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం :- ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సమర్థతపై ఎదుటివారికి విశ్వాసం ఏర్పడుతుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి.

కుంభం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. రాజకీయనాయకులకు ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. స్త్రీలు చుట్టుపక్కల వారి నుండి గౌరవం, ఆదరణలభిస్తుంది.

మీనం :- స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. మీ పాత సమస్య ఒకటి పరిష్కారం కాగలదు. మీ మొండివైఖరి వదిలి ప్రశాంతత వహించుట మంచిది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి.

Advertisement

READ ALSO : పూజలు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లిని తినరు.. కారణం..!!

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd