• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 24.09.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 24.09.2022

Published on September 24, 2022 by Bunty Saikiran

Advertisement

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 24.09.2022: రాశి ఫలాలు.. మానవ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రస్తుతం కాలంలో.. ఈ రాశిఫలాలకు డిమాండ్‌ భారీగానే పెరిగిపోయింది. గతంలో వీటిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మేటు వంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అయితే..ఇవాళ్టి రోజున ఏఏ రాశుల వారికి… ఏం జరుగుతుందో వారి రాశుల ప్రకారం చూద్దాం.

మేషం :- ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి ప్రోత్సాహం, సన్నిహితుల సహకారం ఉంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.

వృషభం :- వస్త్ర వ్యాపారులకు మిశ్రమ ఫలితం. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. మీరంటే గిట్టని వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. ఏ విషయమైన భాగస్వామితో చర్చించటం మంచిది అని గమనించండి.

 

మిథునం :- మనసులో భయాదోళనలు, అనుమానాలు ఉన్నా, డాంభికం ప్రదర్శించిపనులు సాఫీగా పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి. స్త్రీలకు కొత్త పరిచయాల వల్ల వ్యాపకాలు, కార్యక్రమాలు విస్తృతమవుతాయి. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.

 

కర్కాటకం :- ఒక నిర్ణయాన్ని తీసుకొని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండక గందరగోళంలో పడతారు. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి.

సింహం :- ఆదాయం బాగున్నా ఏదో తెలియని అసంతృప్తి, అసహనానికి లోనవుతారు. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలించవు. ప్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులు తప్పవు. విద్యార్థినుల నిర్లక్ష్యం, ఏకాగ్రతలోపం వల్ల ఒత్తిడి, మందలింపులు అధికం. తలపెట్టిన పనులు ఏ మాత్రం ముందుకుసాగవు.

 

కన్య :- మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్యోగంలో మెళుకువ అవసరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు.

Advertisement

 

తుల :- వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు. రుణ ఏ కొంతైనా తీర్చలన్న మీ యత్నం ఫలిస్తుంది. ఉత్సాహంగా మీ యత్నాలు కొనసాగించండి, సత్ఫలితాలు లభిస్తాయి. కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. కుటుంబీకుల ధోరణి చికాకు పరుస్తుంది. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది.

వృశ్చికం :- ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకూలతలున్నా మీ యత్నాలు మందకొడిగా సాగుతాయి. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసివస్తుంది.

 

ధనస్సు :- స్త్రీలపై చుట్టుప్రక్కల వారి మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. రెట్టించిన ఉత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు నెలకొల్పాలనే మీ ఆలోచన బలపడుతుంది. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు.

 

మకరం :- ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలంగా ఉంటుంది. ప్రముఖుల కలయిక ఆశించిన ప్రయోజనం ఉంటుంది. నూతన పెట్టుబడుల విషయంలో మెళుకువ అవసరం. మీ కార్యక్రమాలు సమయానుకూలంగా మార్చుకోవలసి ఉంటుంది.

కుంభం :- సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. వ్యాపారాలు అనవపసర వ్యవహారాలకు దూరంగా ఉండటం వల్ల మేలు చేకూరుతుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్త అవసరం.

 

మీనం :- ఒక విచిత్ర కల మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. పత్రిక, వార్తా సంస్థలలోని వారు ఊహించని ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు.

Advertisement

READ ALSO : ఇదంతా నిన్నే జరిగినట్టు ఉంది అంటూ… రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్!

Related posts:

Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 05.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 12.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 16.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 2.08.2022

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Nanam News. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Latest Posts

  • Ys. జగన్ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎప్పుడూ చూడని రేర్ ఫొటోస్..!!
  • భార్యను లాడ్జికి రప్పించి భర్త ఏం చేశాడో తెలుసా ?
  • పెళ్లి చేసుకునే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి ?
  • భార్య కోసం ఖండాలు దాటిన భర్త.. సైకిల్ పైనే స్వీడన్ కు..!
  • ఒక్క మిస్డ్ కాల్ అంత పని చేసిందా ? రెండు నిండు ప్రాణాలు..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd