• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 25.08.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 25.08.2022

Published on August 25, 2022 by Bunty Saikiran

Advertisement

Rashi Phalalu in Telugu ఈ రోజు రాశి ఫలాలు 25.08.2022: రాశి ఫలాలు.. మానవ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రస్తుతం కాలంలో.. ఈ రాశిఫలాలకు డిమాండ్‌ భారీగానే పెరిగిపోయింది. గతంలో వీటిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మేటు వంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అయితే.. ఇవాళ గురు వారం రోజు. ఇవాళ్టి రోజున ఏఏ రాశుల వారికి… ఏం జరుగుతుందో వారి రాశుల ప్రకారం చూద్దాం.

మేషం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి.

వృషభం :- ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనం. ప్రైవేటు సంస్థలలోని వారు నిగ్రహంతో వ్యవహరించాలి. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలకు మిశ్రమ స్పందన పొందుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒత్తిడికి గురవుతారు.

మిథునం :- ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.

కర్కాటకం :- వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతాయి. ఖర్చులకు సరిపడు ఆదాయం సమకూర్చుకుంటారు.

సింహం :- రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఎరువులు, క్రిమి సంహారక మందుల కొనుగోళ్లలో చికాకులు, ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం, సహకారం అందిస్తారు.

కన్య :- రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. బంధు మిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి.

Advertisement

తుల :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. గృహనిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. టెండర్లు చేజిక్కించుకుంటారు. కొత్త పరిచయాల వల్ల కార్యక్రమాలు విస్తృతమవుతాయి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి.

వృశ్చికం :- హోటల్, తినుబండా వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు. క్రీడా, కళ రంగాల్లో వారికి సంతృప్తి కానరాదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. పెద్దల సలహాను పాటించిమీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.

ధనస్సు :- స్త్రీలు దైవ,పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, ఆల్కహాల్ వ్యాపారస్తులకు ఆశాజనకం. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.

మకరం :- విదేశాలకు వెళ్ళటానికి చేయుయత్నాలు వాయిదా పడతాయి. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషి చేస్తారు. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం.

కుంభం :- గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. కుటుంబీకుల కోసం నూతన పథకాలు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా వుంచండి.

మీనం :- తలపెట్టిన పనుల్లో ప్రోత్సాహం, పరోభివృద్ధి కానవస్తుంది. ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్త్రీలు కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు.

Advertisement

ఇవి కూడా చదవండి : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో కేసీఆర్ కూతురు ?

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd