• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 28.06.2022

Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 28.06.2022

Published on June 28, 2022 by Bunty Saikiran

Advertisement

నిత్యజీవితంలో రాశి ఫలాలు ఒక భాగం అయిపోయాయి. అయితే కొంతమంది వీటిని నమ్మితే..మరి కొంతమంది నమ్మడం లేదు. అయితే ఇవాళ వృషభ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.మకర రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెలుస్తాయి. వీటి వివరాలతో పాటు అన్ని రాశుల వారి గా దిన ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

 

మేషం :- ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. ఆలయాలను సందర్శిస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పరుషమైన మాటలు సంబంధాల్ని దెబ్బ తీస్తాయి. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. సోదరీ, సోదరుల కలయిక, పరస్పర అవగాహన కుదరదు.

వృషభం :- మీ కదలికలపై కొంతమంది నిఘా వేశారన్న విషయం గమనించండి. ఓర్పు, విజ్ఞతతో మీ గౌరవం కాపాడుకుంటారు. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆశాజనకం. సంఘంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. విలాసాల బాగా వ్యయం చేస్తారు.


మిథునం :- వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. అంతగా పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోను, వస్తు నాణ్యతలోనూ మెళకువ అవసరం.

కర్కాటకం :- రుణాల కోసం అన్వేషిస్తారు. ఏది జరిగినా మంచికేనని భావించండి. మీ హద్దుల్లో ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. పత్రిక, వార్తా మీడియా వారికి ఊహించని సమస్యలెదురవుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

సింహం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.

Advertisement

కన్య :- వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిది కాదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మిత్రులు అండగా నిలుస్తారు. విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు.

తుల :- కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. విదేశీయానాలకై చేయుయత్నాలు ఒక కొలిక్కివస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యుల గురించి ధనం వెచ్చిస్తారు. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల, దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం :- ఆర్థిక స్థితి ఆశించిన విధంగా మెరుగు పడకపోవటంతో నిరుత్సాహం తప్పదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివ వచ్చేకాలం. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం వాయిదా పడటం మంచిది. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్దానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

ధనస్సు :- ప్రేమికులకు మధ్య పెద్దల వల్ల సమస్యలు తలెత్తగలవు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదా పడవచ్చు. కుటుంబీకులతో ఏకీభవించలేరు. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం తప్పదు. ఆకస్మికంగా ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.

మకరం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో చికాకులు తప్పవు. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా పాటించటం మంచిది.

కుంభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు, పట్టింపులెదురవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సత్ఫలితాలనిస్తాయి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి.

మీనం :- ఆర్థిక, వ్యాపార విషయాలను గోప్యంగా ఉంచండి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.

Advertisement

Also Read:

స్టార్ కమెడియన్ డెలివరీ బాయ్ గా మారాడు.. కారణం తెలిస్తే..?

Latest Posts

  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 31.03.2023
  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd