Advertisement
ఇవాళ జూలై 3 ఆదివారం. కర్కాటక రాశి వారికి వ్యాపారంలో తగినంత శ్రద్ధ అవసరం. కుంభ రాశి వారికి ఉద్యోగం మారడానికి అలాగే పురోగతి చెందడానికి ఇది మంచి పరిణామం. వీటి వివరాలతో పాటు అన్ని రాశుల వారీగా దినఫలం ఎలాగ ఉందంటే…
మేషం:- వృత్తి పనుల కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశం కలిసివస్తుంది. దూర ప్రయాణాల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది.
వృషభం :- దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలను కొంతమంది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదవకాశాలు లభించగలవు.
మిథునం:- వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్ కాలంను సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఎంతో శ్రమించిన మీదట గాని అనుకున్న పనులు పూర్తికావు.
కర్కాటకం:- పొదుపు చేయాలనే ప్రయత్నము ఫలించదు. కిరణా, ఫాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. మిత్రులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
Also Read: Pakka Commercial Review: పక్కా కమర్షియల్ రివ్యూ
సింహం:- ఉద్యోగస్తులకు విశ్రాంతి లభించడంతో వారి ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. రాజకీయాల్లో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసి పోతాయి. కొన్ని వ్యవహారాల్లో జరిగిన కాలయాపన వల్ల ఒకింత ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.
Advertisement
కన్య:- సన్నిహితుల సహాయంతో పనులు చక్కదిద్దుతారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. దైవ, పుణ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు.
తుల:- ఆర్ధిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయమై న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. గతకాలం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
వృశ్చికం:- విందులలో పరిమితి పాటించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ జీవితం మీరు కోరుకున్నట్లు గానే ఉంటుంది. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు తారుమారవుతాయి. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. ఏ యత్నం కలిసిరాకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు.
ధనస్సు:- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సభా సమావేశాలలో పాల్గొంటారు. సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. విలువైన వస్తువులు ఏర్పరచుకోవాలనే స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి.
మకరం:- ఆర్ధిక వ్యవహారాలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. మీ సంతానం పై చదువుల కోసం ధనం బాగాఖర్చు చేస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.
కుంభం:- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు.
మీనం:- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. బంధు మిత్రులను కలుసుకుంటారు. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొర్రెల రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
Advertisement
ALSO READ : అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ?