Advertisement
వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా రతన్ టాటా కన్నుమూశారు. నిరాడంబరంగా అందంగా విలువలతో జీవించడానికి ఆయన ప్రయత్నం చేశారు. రతన్ టాటా మరణం నేపథ్యంలో ఆయన సాధించిన విజయాలతో పాటుగా ఆయన గుణంపై కూడా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎన్నో అంశాల ఆయన గురించి బయటకు వస్తున్నాయి. దేశంలోనే తొలి లక్ష రూపాయల కారును తీసుకువచ్చిన విషయం మనకి తెలుసు. 1998వ తొలి ప్యాసింజర్ కారు టాటా ఇండికాను తీసుకురావడానికి ఆయన ఎంతో శ్రమించారు. భారత్ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయన తీసుకువచ్చారు. ఇక్కడ జనాన్ని ఆరంభంలో అంతలా ఆకట్టుకోలేదు. దీంతో నష్టాన్ని భరించాల్సి వచ్చింది.
Advertisement
టాటా మోటార్స్ దీనిని అమెరికా కంపెనీ ఫోర్డ్ కి అమ్మాలని భావించారు. ఇండికా కొనాలనే ఉద్దేశంతో బాంబే హౌస్ లోని టాటా హెడ్ క్వార్టర్స్ కి ఫోర్డ్ ప్రతినిధులు వచ్చారు. తొలి దఫా చర్చల తర్వాత చర్చలకు వెళ్లారు. అయితే అక్కడ మాత్రం వారికి అవమానాలు తప్పలేదు. ఫోర్డ్ ప్రతినిధి టాటా మోటార్స్ ప్రతినిధులను ఉద్దేశించి మీకేమో తెలియదు పాసింజర్ కారుల విభాగం ఎందుకు మొదలు పెట్టారని నీచంగా మాట్లాడారు.
Advertisement
Also read:
తర్వాత అదే ఇండికాను పట్టుదలగా ప్రయత్నం చేసి మార్పులు చేసి రతన్ టాటా సక్సెస్ అయ్యారు. దీంతో ఎవరికి అమ్మాల్సిన అవసరం రాలేదు. పదేళ్ల తర్వాత అమెరికాలో వచ్చిన ఆర్థిక మాంద్యం కారణంగా ఫోర్డ్ కంపెనీ కుదేలు అయిపోయింది వాటి బ్రాండ్లను అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న టాటా ఫోర్డ్ ప్రతినిధుల్ని రప్పించుకుని వాటిని టేక్ ఓవర్ చేస్తానని చెప్పారు వాళ్లు ఆ విషయాన్ని బహిరంగనే ఒప్పుకున్నారు. అది ఆయన ప్రతీకారం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!