Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో సొంత కష్టంతో పాపులారిటీ తెచ్చుకుని పైకొచ్చిన నటులు చాలా మందే ఉన్నారు. వారిలో హీరో రవితేజ కూడా ఒకరు. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చాలా కాలం క్రితమే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ నేడు మాస్ మహారాజ్ గా టాప్ పొజిషన్ లో ఉన్నారు. మాస్ మహారాజ్ రవితేజ కూడా మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చారు. నిజానికి రవితేజకు కూడా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. సినిమాలపై ఉన్న ఆసక్తి కొద్దీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ను ప్రారంభించారు.
Advertisement
ఆ తరువాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావడంతో ఆ అవకాశాలను కూడా అందిపుచ్చుకున్నారు. చిన్న చిన్న సినిమాల్లోనే క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ఆ తరువాత హీరోగా వచ్చిన అవకాశాలను కూడా అందిపుచ్చుకుని ఈరోజు టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. అయితే.. ఆయన గురించి ఇప్పుడు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. రవితేజ సినిమాల్లోనే కాదు.. ఓ సీరియల్ లో కూడా నటించారట.
Advertisement
దూర దర్శన్ లో ప్రసారం అవుతున్న ఋతురాగాలు అనే ఓ సీరియల్ లో రవితేజ ఓ ఎపిసోడ్ లో నటించారట. ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఆయన వారం రోజుల షూటింగ్ లో కూడా పాల్గొన్నారట. ఈ షూటింగ్ చేసినందుకుగాను ఆయనకు ఐదు వేల రూపాయల రెమ్యునరేషన్ ను అందుకున్నారట. ఈ సీరియల్ లో రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయగా.. నటుడు రాజీవ్ కనకాల హీరోగా చేశారట. ఈ సీరియల్ లో నటించిన తరువాత ఆయనకు వరుసగా సీరియల్ అవకాశాలు వచ్చాయట. కానీ, రవితేజకు సినిమాల్లోనే కొనసాగాలి అన్న ఆలోచన ఉండడంతో.. సీరియల్ ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తూ వచ్చారట.
Read More:
“చెల్లెల్ని లేపుకుపోయి పెళ్లి చేసుకున్న శివాజీ” అసలు జరిగింది ఇదేనా ? ఆ అమ్మాయి ఎవరంటే ?