Advertisement
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటూ ఆ తల్లిని తలుచుకుంటూనే ఉంటాం. తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి దసరా ని పెద్ద పండగల జరుపుకుంటాం. అసలు ఈ దసరా శరన్నవరాత్రుల వెనుక అసలు కథ ఏమిటో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకోండి. మణి ద్వీపములో కామేశ్వరి, కామేశ్వరుడు అని దంపతులు ఉన్నారు. వీరు పరమశివుని భక్తులు. మహాకామేశ్వరుడిగా అమ్మవారిని.. కామేశ్వరిగా అమ్మవారిని వీరు పూజించుకుంటూ ఉంటారు. ఉదయం పరమశివుడిని.. రాత్రి అమ్మ వారిని వీరు పూజిస్తూ ఉంటారు. ఓసారి మహా కామేశ్వరుడిని పగటి కాలం సమయంలో ఒక్కసారి అయినా పూజించే అవకాశం ఇమ్మని కామేశ్వరుడిని కోరతారు.
Advertisement
అందుకు కామేశ్వరుడు అంగీకరించి మాఘ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి నాటి రాత్రి కాలం పూజించమని అనుగ్రహం ఇస్తాడు. దీనితో పక్కనే ఉన్న మహాకామేశ్వరి ఐన బాల త్రిపుర సుందరికి కోపం వస్తుంది. నాకు కనీసం చెప్పకుండా, నన్ను నిర్లక్ష్యం చేసి వారికి ఎలా అనుగ్రహం ఇస్తారు అంటూ కోపగించి బిల్వ వృక్షం ఎక్కి కూర్చుంటుంది. ఆమె ఉగ్రరూపాన్ని లోకాలన్నీ తల్లడిల్లుతాయి. దీనితో ఆ దంపతులతో పాటు సర్వ గణాలన్నీ మహా కామేశ్వరుడి వద్దకు వెళ్లి స్వామీ ఏమిటి ఈ లీల? మా ఆనందం కోసం మేము రాత్రి కాలం పూజించాలని కోరుకున్నాం. పక్కనే ఉన్న అమ్మవారి అనుజ్ఞ ఎందుకు కోరలేదు? అమ్మవారికి ఎందుకంత కోపం వచ్చింది? అమ్మవారిని శాంతించమని కోరారు.
Advertisement
అంతట కామేశ్వరుడు అమ్మవారిని ప్రార్థనలతో శాంతిప చేయమని ఆదేశించాడు. వారు అలాగే చేసారు. ఆరు పగళ్లు, ఆరు రాత్రుళ్లు అమ్మవారిని పూజలతో శాంతిపచేయడానికి ప్రయత్నించారు. కానీ అమ్మవారు శాంతించకపోవడంతో మహాకామేశ్వరుడి వద్దకు వెళ్లారు. కామేశ్వరుడు కూడా మూడు రాత్రుళ్ళు, మూడు పగళ్ల కాలం అమ్మవారి ఉగ్ర రూపాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. అమ్మ కోపం పెరిగిందే తప్ప తగ్గలేదు. దీనితో మహాకామేశ్వరుడు నీ అనుజ్ఞ లేకుండా నీ కాలంలో నన్ను పూజించుటకు అనుమతి ఇచ్చినందుకు ఈ తొమ్మిది రాత్రి, పగళ్ల కాలం నీ పూజకు అవకాశం ఇస్తున్నానని మహాకామేశ్వరుడు చెప్పాడు. అప్పుడు అమ్మవారు శాంతించి కామేశ్వరుడిని చేరారు. అప్పటి నుంచే ఈ నవరాత్రులు మొదలయ్యాయి. ఈ నవరాత్రుల కాలంలోనే త్రేతాయుగంలో శ్రీరాముడు అమ్మవారిని పూజించి విజయ దశమి రోజున రావణ సంహారం చేసాడు. ద్వాపర యుగంలో పాండవులు ఆయుధ పూజ చేసుకుని యుద్ధానికి వెళ్లి విజయం సాధించారు. అందుకే ఈ నవరాత్రులు అంత విశిష్టత ఉన్నది.
మరిన్ని..
Raviteja Tiger Nageswara Rao Movie Dialogues, టైగర్ నాగేశ్వర రావు మూవీ డైలాగ్స్
Telangana Elections: బిఆర్ఎస్ ను దెబ్బకొట్టేలా టి-కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ.!
Netherland Cricket Team:సౌతాఫ్రికా ఓటమికి ఆ ఆటగాళ్లే కారణమా..? కట్టప్పల్లా మారి..?