Advertisement
నాగబాబు కూతురు నిహారిక సీనియర్ ఐపీఎస్ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కొడుకు వెంకట చైతన్య జొన్నలగడ్డని ఇష్టపడింది. ఇద్దరూ కూడా కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొంతకాలం నుండి వీళ్ళిద్దరూ విడిపోయారని ఎన్నో వార్తలు వచ్చాయి. కొంతకాలం నుండి నిహారిక తన భర్తతో దూరంగా ఉంటోంది. తాజాగా కుకట్ పల్లి కోర్టులో విడాకుల కోసం పిటిషన్లు దాఖలు చేసింది. ఇద్దరి అంగీకారంతో విడాకులని దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
2020లో చైతన్య, నిహారికల పెళ్లి రాజస్థాన్లో ఎంతో ఘనంగా జరిగింది. రెండేళ్ల పాటు ఇద్దరు బానే ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వలన కొంత కాలం నుండి కూడా వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలో కూడా చైతన్య కనబడలేదు. చైతన్య తన ఫ్యామిలీతో పాటు తిరుమలలో కనపడ్డారు. దీంతో వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. నిహారిక పిటిషన్ తో విడాకులు తీసుకోబోతున్నట్లు ఫైనల్ గా కన్ఫమ్ చేసింది. అయితే ఎందుకు ఈ జంట విడిపోవాలనుకుంటున్నారో దాని వెనక కారణం ఏంటి అనేది తెలీదు.
Advertisement
నెట్టింట మాత్రం గతంలో జరిగిన కొన్ని సంఘటనలే విడాకులకి కారణమని అంతా అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య విభేదాల వలన విడిపోవడానికి కారణం అని అంటున్నారు. పెళ్లి తర్వాత ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది. ఒకసారి పబ్ పార్టీలో నిహారిక పేరు వినపడింది. ఆ వార్త మామూలుగా స్ప్రెడ్ అవ్వలేదు. విపరీతంగా వైరల్ అయింది. తర్వాత అపార్ట్మెంట్ గొడవ కూడా చోటు చేసుకుంది. వీటి కారణంగా వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి విడివిడిగా ఉంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
Also read: