Ads
ANASUYA : యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేస్తుండటంతో కామెడీ ప్రియుల్ని కలవరపెడుతుంది. జబర్దస్త్ లో కామెడీ డోస్ తో పాటు అనసూయ హ్యట్రిక్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆమెపై వేసే డబుల్ మీనింగ్ డైలాగులు, అనసూయ హావ భావాలు, అందాల ఆరబోత జబర్దస్త్ ఎక్స్ ట్రా ఎంటర్టైన్మెంట్ కాగా, ఇప్పుడు ఈ సీనియర్ యాంకర్ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేస్తుందని వార్త వైరల్ అవుతుంది.
Also Read: ఇంటి గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడతారు…? అలా కడితే ఏం జరుగుతుందంటే…!
తాజాగా ఆమె ఫేస్బుక్ ఇన్ స్టా స్టోరీలలో పెట్టిన పోస్టు, ఇన్ డైరెక్ట్ గా తాను జబర్దస్త్ ని వీడుతున్నట్టు అర్థం వచ్చేట్టు గానే ఉంది. తన కెరీర్లో ఇది పెద్ద నిర్ణయం అని, ఎన్నో స్వీట్ మెమోరీస్ ని వెంట తీసుకుని వెళ్తున్నానని మధుర క్షణాలతో పాటు చేదు క్షణాలు కూడా ఉన్నాయన్నది. మొత్తానికి జబర్దస్త్ ను వీడి, స్టార్ మా లోని ఓ పోగ్రామ్ కు అనసూయ డీల్ కుదుర్చుకుందట. అందుకే జబర్దస్త్ ను వీడుతోందుట. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం, అనసూయ జబర్దస్త్ ని వీడటానికి బలమైన కారణాలే ఉన్నట్టు తెలుస్తోంది.
Advertisement
ముఖ్యంగా అనసూయ టీవీ షో లతోపాటు సినిమాల్లోను బిజీగా మారింది. ఆమెకు వరసగా ఆఫర్లు క్యూ కడుతుండడంతో డేట్స్ అడ్జస్ట్ కావడం కష్టంగా మారింది. దీనికి తోడు ఒకప్పుడు టాప్ రేటింగ్ లో దూసుకుపోయిన జబర్దస్త్ రేటింగ్ పరంగా కుదెలు కావడం కూడా, అనసూయ నిష్క్రమణకు కారణంగా తెలుస్తోంది. ఇవే కాకుండా, స్టార్ మా చానల్ లో అనసూయ- సుధీర్ లు సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తున్నారు. దీంతోపాటు ‘పార్టీ చేద్దామా పుష్ప’ అనే స్పెషల్ ఈవెంట్ ని కూడా అనసూయ- సుధీర్ లు హోస్ట్ గా చేయబోతున్నారు. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ, జబర్దస్త్ లో రెగ్యులర్ యాంకర్ గా కొనసాగడం కష్టం కాబట్టి, అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.