Advertisement
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు సూపర్ హీరో సినిమా “హనుమాన్” ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజ సజ్జ, అమృత అయ్యర్, మరియు వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య మరియు పలువురు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించారు. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా థియేటర్లలో దూసుకెళ్ళిపోతోంది. అయితే.. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
అమెరికాలో మూడు మిలియన్ల ప్లస్ వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఇక గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ సినిమాల కలెక్షన్ ఒకెత్తు అయితే.. ఈ సినిమా కలెక్షన్స్ మరొక ఎత్తు అని సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. రేపో మాపో వంద కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరుతుంది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి కారణం నార్త్ లో అయోధ్య టాపిక్ ఒకటే కాదు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ సినిమా నిర్మాత గట్టిగ నిలబడడమే అని చెప్పొచ్చు.
Advertisement
ఈ సినిమా భారీ సినిమా, పెద్ద బడ్జెట్ లు పెట్టి తీసిన సినిమాలతో పోటీ పడింది. అయితే సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుని రిలీజ్ డేట్ మార్చాలంటూ రిక్వెస్ట్ చేసినా.. ఈ సినిమా నిర్మాత వెనక్కి తగ్గలేదు. రొటీన్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే వెకిలితనం ఈ సినిమాలో లేకపోవడం ప్రేక్షకులకు ఉపశమనాన్ని ఇచ్చింది. పండగ సమయంలో ఫామిలీ తో, పిల్లలతో వెళ్ళడానికి అనువైన సినిమా హనుమాన్. ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర లాంటి భారీ బడ్జెట్ ల గ్రాఫిక్స్ వెతలు చూసిన ప్రజలకు దానికి కేవలం పదో వంతు ఖర్చుతోనే అద్భుతమైన గ్రాఫిక్స్ ని ప్రెసెంట్ చేయడం మరో ప్లస్ పాయింట్. ఇక సినిమా క్లైమాక్స్ అన్నిటికంటే హైలైట్. ఈ సినిమా కంటెంట్ మరియు క్వాలిటీ ఇతర సినిమాల కంటే గొప్పగా ఉండడమే ఇంతటి విజయాన్ని సాధించి పెట్టాయి.