Advertisement
గత కొన్ని నెలల నిరీక్షణ, ఎన్నో ఆశలు, భారీ బడ్జెట్ అన్నిటికీ మించి పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఇన్ని హంగులు కలిపిన సినిమా అంటే అభిమానులకు ఎన్నో ఆశలు ఉంటాయి. రౌడీ హీరో ఈ సినిమాలో సరికొత్త లుక్ లో బాక్సింగ్ నేపథ్యంలో రావడంతో, రోజురోజుకు అభిమానుల నిరీక్షణ పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఎదురు చూశారు. దీంతో మూవీ ఆగస్టు 25వ తేదీన థియేటర్లోకి రానే వచ్చింది.
Advertisement
ఇవి కూడా చదవండి: ధ్వజస్తంభం లేని గుడిలో ప్రదక్షిణ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా..?
కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. బాహుబలి, కేజిఎఫ్, కేజిఎఫ్-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు హిందీ పేక్షకులను టార్గెట్ చేసి తీసిన సినిమాలు కావు. అవి పక్కాగా మన కథలు. అవి హిందీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన వాటిని అపూర్వంగా ఆదరించారు.
Advertisement
కానీ పాన్ ఇండియా లెవెల్ లో కొన్ని సౌత్ సినిమాలు సక్సెస్ అయ్యాయి కదా అని, అక్కడి ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తీసిన సినిమాలు మాత్రం బోల్తా కొట్టడం గమనార్హం. ఆ సినిమాలే, రాదే శ్యామ్, లైగర్. ఈ రెండు చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఇక్కడి సినిమా లాగా ఫీల్ అవ్వలేదు. వాటిలో హిందీ వాసనలు ఎక్కువగా కనిపించాయి. హిందీ ఆర్టిస్టులను ఎక్కువగా పెట్టుకోవడంతో పాటు, కథాంశాలు, లొకేషన్లు అన్నీ కూడా నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చూసుకున్నారు. బాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకున్నారు.
పాటలు పూర్తిగా హిందీ ఫ్లేవర్ లో తీర్చిదిద్దుకున్నారు. కట్ చేస్తే ఈ రెండు చిత్రాలు అటు హిందీ ఆడియన్స్ ను మెప్పించలేకపోయాయి. ఇటు తెలుగు ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయాయి. మనం మన కథల్ని నమ్మి, మన స్టైల్ లో తీస్తే మన వాళ్లకు నచ్చడమే కాక, హిందీ ప్రేక్షకులు కొత్తగా ఫీలై ఆదరిస్తారు అన్నది స్పష్టం. వాళ్ళు బాలీవుడ్ చిత్రాలను డస్ట్ బిన్ లో పడేసి మన స్టైల్ సినిమాలే కోరుకుంటున్నప్పుడు, మళ్లీ మన వాళ్ళు వాళ్ళ అభిరుచికి తగ్గట్లు సినిమా చేయాలని ట్రై చేసి బోల్తా కొట్టడం విడ్డూరం. మరి ‘రాదేశ్యామ్, లైగర్’ సినిమాల ఫలితాలు చూసైనా మన ఫిలిం మేకర్స్ పాటలు నేర్చుకుంటారేమో చూద్దాం.
Read Also : త్రివిక్రమ్ సినిమాల్లో హీరోల చంకల్లో బ్యాగులు ఎందుకు ఉంటాయి?