Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ముందు, వివాహానికి తర్వాత అనే రెండు ఘట్టాలు ఉంటాయి.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆడపిల్లలు వివాహానికి ముందు తల్లిదండ్రుల దగ్గర ఉండి వివాహం తర్వాత పూర్తిగా తన జీవిత భాగస్వామితో ఉంటారు. ఈ అబ్బాయిల విషయానికొస్తే వివాహానికి ముందు తనకు నచ్చినట్టు ఉన్న వివాహం తర్వాత మాత్రం తనకు వచ్చిన కొత్త కుటుంబం కోసం జీవిత కాలమంతా బాధ్యతగా ఉంటారు..
Advertisement
ఏది ఏమైనా వివాహ జీవితం అనేది సక్రమంగా సాగాలంటే భార్య, భర్తల మధ్య సఖ్యత అనేది కరెక్ట్ గా ఉండాలి.. ముఖ్యంగా మగవారికి అయితే అర్థం చేసుకునే ఆడపిల్లలు భార్యగా వస్తే వారి జీవితం కలకాలం సుఖమయమే. ఇంతకీ మీ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ గురించి మీరు ఏం విషయాలు తెలుసుకోవాలి, వాళ్ల గురించి మీకు ఏ విషయాల్లో క్లారిటీ ఉండాలంటే? ఈ రూల్స్ పాటించండి.
Advertisement
ఏ రిలేషన్ కు అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మూలం డబ్బు. అందుకే మీకు కాబోయే భాగస్వామి ఫైనాన్స్ లో ఎలా ఉంటారో తెలుసుకోవాలి. అందుకే పెళ్లికి ముందే వీటి గురించి మీరు చర్చించుకోవాలి. కొందరు ఒకరిని ప్రేమిస్తారు. పరిస్థితుల వల్ల మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి మీరు మానసికంగా రెడీ అయితే పర్వాలేదు. కానీ మనసులో ఒకరు ఉండి, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు జీవితాలు, రెండు కుటుంబాలు ఆగమైపోతాయి. ఇంకొకరితో పెళ్లికి రెడీ అయితే గత జ్ఞాపకాలను మీరు చేసుకోబోయే భాగస్వామి వద్ద దాచడం కరెక్ట్ కాదు. కాబట్టి మీ గురించి అన్ని విషయాలను ముందే చెప్పండి.
ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడం కామన్. కానీ కొంతమందికి తమ వైఫ్ ఉద్యోగం చేయడం నచ్చదు. ఈ విషయంలో గొడవలు రావద్దంటే పెళ్లికి ముందే ఈ విషయాన్ని మీ పార్ట్నర్ తో చర్చించాలి. అలాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడాలి. వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవాలి. దాన్ని బట్టి వాళ్లను పెళ్లి చేసుకోవాల వద్ద అని ఓ క్లారిటీ వస్తుంది. ఇక వీటితో పాటు పెళ్లయ్యాక పిల్లల విషయంలో ఎవరి వ్యక్తిగత సమయాన్ని వాళ్లకు వదిలేసే విషయంలో, ఉమ్మడి కుటుంబమా? లేదంటే విడిగా ఉండాలా? వంటి అంశాల్లో కూడా ముందే ఓ స్పష్టత తెచ్చుకుంటే వైవాహిక బంధం లో గొడవలకు తావుండదు. తద్వారా జంటలు తమ అన్యోన్య దాంపత్యాన్ని పది కాలాలపాటు పదిలపరచుకోవచ్చు.
ఇవి కూడా చదవండి : మంచు మనోజ్, భూమా మౌనికల రెండో పెళ్ళికి ఉన్న అసలు అడ్డంకి అదేనా?