Advertisement
Renudesai Interview: రేణుదేశాయ్ పేరు వినగానే ముందు మైండ్ లోకి వచ్చే విషయం పవన్ కళ్యాణ్ తో విడాకుల అంశమే. వీరిద్దరూ విడిపోయి చాలా కాలమే అవుతున్నా.. రేణు దేశాయ్ ఒంటరిగానే పిల్లలను పెంచుకుంటూ వస్తున్నా.. ఈ టాపిక్ గురించిన డిస్కషన్ మాత్రం ఆగదు. అయితే.. ఇది ఆమెకు ఎంత బాధాకరమో చెప్పక్కర్లేదు. కానీ రేణు దేశాయ్ తన జీవితంలో ఇంతకు మించిన బాధనే అనుభవించారట. గత ఇరవై ఏళ్లుగా విడాకుల విషయంలో ట్రోలింగ్ ను ఎదుర్కొన్న ఆమె పెళ్లి కి ముందు జీవితం ఏమీ పూల పాన్పు కాదు.
Advertisement
పెళ్ళికి ముందు కూడా ఆమె చాలా కష్టాలనే ఎదుర్కొన్నారు. చాలా చిన్న వయసు నుంచే ఆమె లింగ వివక్ష సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “టైగర్ నాగేశ్వర్రావు” సినిమాతో రేణు దేశాయ్ కూడా వెండితెర రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా రేణు దేశాయ్ చురుకుగా పాల్గొంటున్నారు. అయితే.. ఈ సందర్భంగా ఓ సారి ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు.
Advertisement
పుట్టినప్పుడే తానూ లింగవివక్షకు గురి అయ్యానని.. పుట్టిన మూడు రోజుల వరకు నా తండ్రే నా ముఖం చూడలేదని చెప్పుకొచ్చారు. ఈ విషయం మా అమ్మ చెప్పగానే చాలా బాధపడ్డాను. నేను పుట్టిన ఏడాదికే మా తమ్ముడు పుట్టాడు. అతన్ని రాజులా పెంచారు. దీన్ని బట్టే నేను ఏ పరిస్థితులలో పెరిగానో అర్ధం అయ్యే ఉంటుంది. మదర్స్ డే వస్తే నాకు నా బాల్యమే గుర్తొస్తుంది. నా టాపిక్ వస్తే నా విడాకుల గురించే ఎక్కువ మాట్లాడతారు. కానీ, ఈ విషయం నన్ను విడాకుల కంటే ఎక్కువ బాధ పెడుతుంది. ఆడపిల్లని ఒకలా, మగపిల్లలని ఒకలా చూడడం అనేది చాలా దారుణం. తల్లి ప్రేమని కూడా సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం బాధాకరం. అమ్మకి నచ్చేలా ఉండాలని, అమ్మ మెచ్చుకోవాలని చాలా కోరుకున్నా. కానీ ఎప్పుడు నిరాశే మిగిలేది. నాకు 19 ఏళ్ల వయసు వచ్చాకా మా అమ్మని ప్రేమని పంచమని అడుక్కున్నాను. అడిగినా నాకు తల్లి ప్రేమ దొరకలేదు. అందుకే.. నా పిల్లలకు ప్రేమని పంచాను. వారిపై నా ప్రేమ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేది కాదు అంటూ ఎమోషనల్ అయ్యారు.
మరిన్ని…
“రంగస్థలం” సినిమాలో చిట్టిబాబు ఈ పని చేసి ఉంటె బాగుండేది ఏమో కదా..?
గుడికి వెళ్లేముందు ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఎలాంటి ఆహరం తీసుకోకూడదు?
Spandana APస్పందన యాప్ అంటే ఏమిటి? దీని వలన ప్రజలకు కలిగే లాభాలు ఏమిటి?