Advertisement
Repeat Movie Review Telugu: నటుడు నవీన్ చంద్ర… టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. దీంతో నేను లోకల్, అరవింద సమేత తదితర మూవీస్ లో నెగిటివ్ తరహా రోల్స్ చేశాడు. అందాల రాక్షసి తో ప్రేమికుడి పాత్రలో మెప్పించిన నవీన్ చంద్ర, అనంతరం చాలా వరకు అదే తరహా పాత్రలో కనిపించాడు. అయితే అరవింద సమేతతో రూట్ మార్చిన ఈ హీరో సపోర్టింగ్ రోల్స్ కు కూడా ఓకే చెబుతున్నాడు. సినిమా, వెబ్ సిరీస్ అంటూ తేడా లేకుండా విభిన్న తరహా పాత్రలో మెప్పిస్తున్నాడు. ఇటీవల కాలంలో పరంపర అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించి నవీన్, తాజాగా మరోసారి లీడ్ రోల్ లో కనిపించనున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం రిపీట్. థియేటర్లో కాకుండా ఓటిటిలో ఈ సినిమా డైరెక్ట్ గా విడుదల అయింది.
Advertisement
కథ మరియు వివరణ:
సుబ్రహ్మణ్యం (అచ్యుత్ కుమార్) నవల రచయిత. క్రైమ్ నవలల్లో అతడు ఊహించి రాసిన సంఘటనలు రియల్ లైఫ్ లో జరుగుతుంటాయి. డీజీపీ ఆశా ప్రమోద్ (మధుబాల) కూతురు పూజ కిడ్నాప్ అవుతుంది. ఆ కిడ్నాపర్ సుబ్రహ్మణ్యం అనే అనుమానంతో అతనితో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారు. ఈ సంఘటనల మీడియాలో హైలైట్ కావడంతో డిజిపి పై విమర్శలోస్తాయి. దాంతో తన కూతురు కిడ్నాప్ కేసును మీడియాకు తెలియకుండా సైలెంట్ గా సాల్వ్ చేయాలని అండర్ కవర్ ఆఫీసర్ విక్రమ్ (నవీన్ చంద్ర) సహాయం తీసుకుంటుంది ఆశా ప్రమోద్. అసలు పూజలు కిడ్నాప్ చేసింది ఎవరు? డిజిపి కూతురు కిడ్నాప్ తో రచయిత సుబ్రహ్మణ్యానికి ఉన్న సంబంధం ఏమిటి? ఆశా ప్రమోద్ చేసిన ఓ ఫేక్ ఎన్ కౌంటర్ మిస్టరీని విక్రమ్ ఎలా బయటపెట్టాడు? జనని అనే అమ్మాయి చేయబడిన క్యాబ్ డ్రైవర్ మరల బతికి ఎలా వచ్చాడన్నదే ఈ సినిమా కథ.
Advertisement
‘రిపీట్’ అంతా చూసాక, ఓ మేజర్ ట్విస్ట్ రిపీట్ చేసినట్లు ఉంటుంది. ప్రభాస్ ‘సాహో’ లో ఓ ట్విస్ట్ గుర్తుకువస్తుంది. అది పక్కన పెడితే, ఇది ఓ రివెంజ్ త్రిల్లర్. దిశా కౌంటర్ ఘటన ఛాయలు కథలో కీలక మలుపుకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. కథగా చూస్తే, ‘రిపీట్’ ప్రేక్షకులకు తెలిసిన కథ. కానీ, కొత్తగా చెప్పాలని దర్శకుడు అరవింద్ శ్రీనివాసన్ చేసిన కృషి మొదటి గంటలో స్పష్టంగా కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనాలు
నవీన్ చంద్ర, అచ్యుత్ కుమార్ నటన
కథలోని మలుపులు
మైనస్ పాయింట్స్:
లాజిక్స్ మిస్ కావడం
మధుబాల క్యారెక్టర్
ఇన్వెస్టిగేషన్ సీన్స్ బోరింగ్ గా సాగడం
రేటింగ్: 2.5/5