Ads
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ ప్రత్యర్థిని ఖరారు చేసుకుంది. మొన్న ఆదివారం సూపర్-12 దశ గ్రూప్-2 లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వే ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో జింబాబ్వే జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో ఊహించని ఘటన ఒకటి జరిగింది. భారత్ కు చెందిన ఓ అభిమాని తన హీరో రోహిత్ శర్మన్ని కలవాలని అనుకున్నాడు. అంతే భద్రతా సిబ్బంది కళ్ళు కప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు.
గమనించిన భద్రతా సిబ్బంది అతడి వెనుక పరుగులు తీసి మొత్తానికి పట్టుకున్నారు. ఈ క్రమంలో రోహిత్ ను చూస్తూనే అభిమాని ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే అతడు రోహిత్ ను కలవక ముందే సిబ్బంది అతడిని పట్టుకొని బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కాగా, మైదానం లోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించిన ఆ అభిమాని పై రూ. 6.5 లక్షల జరిమానా విధించారు.
Advertisement
కాగా సెమీస్ కు ముందు టీమిండియా కు షాక్ తగిలింది. ఈ నెల 10వ తేదీన అంటే ఎల్లుండి సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. అటు ఫామ్ లో లేని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రాక్టీస్ చేశాడు. ఈ తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తీవ్ర గాయం అయింది. ఆడి లైడ్ లో ప్రాక్టీస్ సెషన్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కుడి చేతికి గాయం అయింది. దీంతో రోహిత్ శర్మ సెమి ఫైనల్ లో ఆడతాడా లేదా అనేది తేలాల్సి ఉంది.
READ ALSO : సెమీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ..రోహిత్ ఔట్ !
My god 🥺, @ImRo45 ❤️ loves his fans wholeheartedly, he ran and came to protect his devotee. pic.twitter.com/osxIAY98Cw
— Rohit Sharma Fanclub India (@Imro_fanclub) November 6, 2022