Advertisement
జబర్దస్త్ ప్రోగ్రాం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల పాటు ఈ కార్యక్రమానికి జడ్జీలుగా నాగబాబు, రోజా అలరించారు. కానీ, కొన్ని కారణాల వల్ల నాగబాబు బయటకొచ్చారు. కానీ, రోజా కంటిన్యూ చేశారు. అయితే.. మంత్రి పదవి కారణంగా ఆమె కూడా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఇన్నేళ్లపాటు కలిసి ట్రావెల్ చేసిన వీళ్లిద్దరూ పోటాపోటీగా తిట్టుకున్న సందర్భాలు చాలా తక్కువే. రోజా వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా.. నాగబాబు జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
Advertisement
మామూలుగా జనసేన అన్నా.. పవన్ కళ్యాణ్ అన్నా.. తిట్టడానికి ముందుండే వాళ్లలో రోజా ఒకరు. అయితే.. మంత్రి అయ్యాక.. మాటల దాడిలో మరింత స్పీడ్ పెంచారు. అలా.. ఇన్నేళ్లుగా ప్రజలకు మెగా ఫ్యామిలీ చేసిందేమీ లేదని.. అందుకే ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతున్నారని వ్యాఖ్యానించారు. రోజా చేసిన ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో రోజాను మెగా ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ చేసిన సేవాకార్యక్రమాల లిస్టును చూపిస్తూ.. మీ సీఎం పిల్లికి భిక్షం వేశాడా? అంటూ నిలదీశారు.
Advertisement
ఈ వివాదంలో మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. రోజా నోరు.. మున్సిపాలిటీ కుప్పుతొట్టే ఒకటేనంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అందుకే ఇన్నిరోజులు ఏమీ అనలేదని.. కావాలనే మున్సిపాలిటీ కుప్పతొట్టెను ఎవరూ కెలకరని…. అందుకే రోజా కామెంట్స్ పై రియాక్ట్ కాలేదన్నారు. ప్రస్తుతం పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉందని.. దాన్ని ఎలా పైకి తీసుకురావాలో ఆలోచిస్తే బెటర్ అని సూచించారు. ఇలా మాట్లాడుతూ పోతే… రోజా పదవి నుంచి దిగిపోయేసరికి కచ్చితంగా 20వ స్థానానికి దిగజారుతుందని ఎద్దేవ చేశారు. పర్యటక శాఖను డెవలప్ చేయడమంటే మంత్రి పర్యటనలు చేయడం కాదని వ్యంగ్యంగా స్పందించారు.
నాగబాబు కామెంట్స్ కు రోజా కౌంటర్ ఇచ్చారు. ఏం తెలియకుండా తన శాఖ గురించి వ్యాఖ్యలు చేయడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. తాను పర్యాటక శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నాక ఇండియాలో ఏపీ టూరిజం మూడో స్థానంలో ఉందని చెప్పారు. గతంలో టీడీపీ, జనసేన మాట్లాడుకున్న మాటల్నే గుర్తు చేస్తే ఎందుకంత పౌరుషం వచ్చిందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీద శత్రుత్వం లేదని.. పార్టీ పరంగా, సిద్ధాంతపరంగానే తన వ్యాఖ్యలుంటాయని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మీ పార్టీ వాళ్లను సంకరజాతి, అలగా జనం అని అంత హీనంగా మాట్లాడినప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుందో పైవాడికే తెలియాలన్నారు రోజా. అయినా.. ఓడిపోయిన మీరే అన్ని మాటలంటే.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తాను ఎంత అనాలని మండిపడ్డారు. ముందు మహిళను ఎలా గౌరవించాలో తెలుసుకోండి అంటూ ఫైరయ్యారు.