Advertisement
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. దాంతో సీఎం చంద్రబాబు నాయుడు పాలన పై మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనేత ఆర్కే రోజా ఈ విధంగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు 100 రోజులు పాలించిన సమయంలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయని అవి కప్పిపుచ్చడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. వరదలు, మహిళల పై జరుగుతున్న దాడులు, వైసీపి నాయకులు పై జరుగుతున్న దాడులు. వీటన్నిటిని కప్పిపుచ్చేందుకే ఇలాంటి పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.
Advertisement
అంతేకాక ఇచ్చిన ఎన్నో హామీలు నెరవేర్చలేకపోయాడు ఇన్ని తప్పులు చేసినా సరే ప్రజల దృష్టి మళ్లించడానికి తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. రాజకీయంలో ఎదగాలని వెంకటేశ్వర స్వామిని కూడా వదలడం లేదని అంటున్నారు. పైగా చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదో ఒకటి తెరపైకి తీసుకొచ్చి పార్టీ నేతలతో ప్రచారం చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు జగన్ పై ఆరోపణలు చేయడం సమంజసం కాదని తిరుపతి లడ్డు లో జగన్ అనిమల్ ఫ్యాట్ ను మిక్స్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారు అయితే ఇటువంటి ఆరోపణలు జగన్ పై చేయడం సమంజసం కాదు అని రోజా అంటున్నారు.
Advertisement
Also read:
ఈవో శ్యామల రావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యి ను వాడుతున్నట్లుగా తెలిపారు. జూలై 23 న వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ చేశారు అందుకే నెయ్యి ను వెనక్కి పంపాం అంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు నెలల తర్వాత సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక కారణాలు ఏంటని నింద వేశారు. శ్యామల రావు పై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు అని రోజా ఆరోపించారు. ఇదంతా మీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!