Advertisement
CM Jagan Meeting with Roja: ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ లెక్కల ప్రకారం ప్లాన్స్ వేసుకుంటున్నాయి. అధికార వైసీపీ పార్టీ కూడా తమ పార్టీనే అధికారంలో కొనసాగాలి అన్న ఉద్దేశ్యంతో అనేక మార్పులు చేర్పులు చేస్తోంది. వైసీపీ పార్టీ పాలన బాగున్నప్పటికీ.. కొన్ని నియోజక వర్గాలలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల కారణంగా జనాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది అని గుర్తించిన జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ల మార్పు చేర్పుల ప్రక్రియను ప్రారంభించారు.
Advertisement
ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలను పిలిచి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కూడా సీఎం జగన్ ప్రకటన చేసారు. ఈ క్రమంలోనే నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు కూడా తాడేపల్లి నుంచి పిలుపు అందిందని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏమి చర్చలు జరగనున్నాయన్న విషయమై ఏపీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Advertisement
ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు ,చిత్తూరు, అనంతపురం, కడప జిల్లా లలో ఎక్కువ మార్పులు చేయాలనీ సిఎం జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి రోజాతో సహా పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఈ మార్పుల్లో భాగంగానే కొందరికి ఈ సారి టికెట్ దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు కూడా ఈసారి టికెట్ ఉండక పోవచ్చని వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన రోజా తనకు టికెట్ ఇవ్వకున్నా.. తాను జగన్ కోసమే పని చేస్తానని రోజా స్పష్టం చేసారు. ఈ క్రమంలోనే తాడేపల్లి నుంచి రోజాకు పిలుపు రావడంతో.. టికెట్ విషయమై సీఎం జగన్ రోజాకు ఎటువంటి హామీ ఇస్తారన్న విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తి న ఎలకొంది.
Read More:
తీన్మార్ మల్లన్న సినిమాల్లో నటించారా..? కామెడీ సీన్స్ వైరల్…!
అచ్చం ఐశ్వర్యరాయ్ లాగే ఉన్న ఈ 6 మంది ఎవరు..? ఆమె చెల్లెళ్ళు మాత్రం కాదు..!