Advertisement
గత రెండు సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ కరోనా ప్రకంపనంలో పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఎంతో మంది హీరోలు ఎలాంటి ఇన్కమ్ లేక అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ కోలుకోవడం కష్టమే అన్న సమయంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ తరుణంలోనే నిరసించిపోతున్న మనిషికి గ్లూకోజ్ తాగించి ఇన్స్టంట్ ఎనర్జీని అందించినట్టు, ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించి రాజమౌళి సినీ ఇండస్ట్రీని మళ్లీ టాప్ లెవెల్ లోకి తీసుకువచ్చారు. ఈ మూవీలో రామ్ చరణ్ సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అదరగొట్టారని చెప్పవచ్చు. పర్ఫెక్ట్ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ మూవీ ఆస్కార్ బరిలో ఉండబోతోందని అంటూ వార్తలు వస్తున్నాయి..
Advertisement
ALSO READ:రీల్ లైఫ్ లో కలిసి నటించి రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్న జంటలు..ఎవరంటే..?
Advertisement
ప్రస్తుత ఈ మూవీ ఆస్కార్ కి ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో నామినేట్ అవుతోంది.. అవ్వాలి అంటూ కూడా ట్వీట్ చేస్తున్నారు.. అయితే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ కు నామినేట్ అయినట్లయితే కంపెయిన్ P&A (ప్రింట్ అండ్ అడ్వర్టైజింగ్) కోసం నిర్మాత డివివి దానయ్య ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం.. ఏదైనా మూవీ ఆస్కార్ కు నామినేట్ అయినట్లయితే దీనికోసం ప్రత్యేకంగా పబ్లిసిటీ కాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. అక్కడి సెలక్టు ఆడియన్స్, ఫిల్మ్ మేకర్స్ కు స్పెషల్ షో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గతంలో కూడా అత్యధిక ఆస్కార్ అవార్డు అందుకున్న “పారాసైట్” సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ కోసం దాదాపుగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. P&A కొరకు ఓవరాల్ గా 17నుంచి 18 మిలియన్ డాలర్స్ అంటే 120 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
ఆస్కార్ కి సెలెక్ట్ అయిన తర్వాత నామినేట్ అవ్వడం కోసం సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని కొంతమంది నిర్మాతలు అంటున్నారు. “విశారనై” ప్రొడ్యూసర్ అయినా ధనుష్ ఖర్చుకు వెనకాడకుండా ప్రమోషన్స్ చేసాడు కానీ ఆ మూవీ మాత్రం ఆస్కార్ కు నామినేట్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ గనుక ఆస్కార్ కు నామినేట్ అయితే నిర్మాతలు తక్కువలో తక్కువ 30 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆస్కార్ అవార్డు వచ్చినట్లయితే మాత్రం వారు ఖర్చుచేసిన ఖర్చు కంటే ఎక్కువ నెక్స్ట్ సినిమా వరల్డ్ ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. అందుకే రాజమౌళి ఖర్చుకు వెనకాడకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ALSO READ:వెంకటేష్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్.. ఇంతమంది ఉన్నారా..?