Advertisement
మెగా డాటర్ నిహారిక గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నిహారిక మెగా ఫ్యామిలీ నుండి వచ్చి అప్పుడప్పుడు షోస్ వంటి వాటిలో కనపడేది. అలానే కొన్ని సినిమాలు చేయడం మనం చూసాం. తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోతోంది అని టాక్ వచ్చినప్పటి నుండి కూడా వార్తల్లో నిలుస్తోంది ఆమె. నిహారిక గురించి సోషల్ మీడియాలో ఎన్నో డిస్కషన్స్ జరిగాయి తాజాగా ఆమె చేసిన పోస్ట్ కి నెటిజెన్స్ మండిపడుతున్నారు. అసలు ఏమైందనే విషయానికి వస్తే రీసెంట్ గా ది సోల్ ఆఫ్ సత్య స్పెషల్ సాంగ్ లో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కలర్స్ స్వాతి నటించిన విషయం తెలిసిందే.
Advertisement
ఈ సాంగ్ లో సాయి ధరమ్ తేజ్ కోసం దేశం కోసం పోరాడే సైనికుడిగా ఉంటాడు. భార్య సత్య గా స్వాతి నటిస్తోంది. భర్త కోసం ఆమె పడే ఆవేదన, ఆనందం మనసుని తాకే విధంగా ఉంటాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్ కి ముందు నిహారిక ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. ఈ పాట కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను అని ఆమె చెప్పింది.
Advertisement
వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పెళ్లి చేసుకున్నాక ఫ్యామిలీ మీద లేదు అని ఒక సోషల్ మీడియా యూజర్ కామెంట్ చేశారు. ఆ పోస్ట్ కి సాయి ధరమ్ తేజ్ నోరు అదుపులో పెట్టుకో వెంటనే కామెంట్ డిలీట్ చెయ్యి అని రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. అలానే కామెంట్స్ ని ఎవరికి వారు తొలగించినట్లు తెలుస్తోంది. సాయి ధరంతేజ్ చెప్పేసరికి సోషల్ మీడియా యూజర్ భయపడి డిలీట్ చేసేసాడు. కానీ భారీగా ట్రోల్స్ వచ్చాయి.
Also read: