Advertisement
Salaar Movie Child Artist Sayyed Farzana: ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ ని అందుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ప్రభాస్ కటౌట్ గురించి విలన్ గురించి మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులంతా. తాజాగా ఈ సినిమాలో నటించిన అమ్మాయి గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. సలార్ సినిమాలో నటించిన అమ్మాయి ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా మరి ఆ వివరాలను ఇప్పుడే చూద్దాం.
Advertisement
Salaar Movie Photos
సలార్ సినిమాలో నటించిన చాలామంది నటులు ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఈ మూవీలో సురభి పాత్ర కింద నటించిన అమ్మాయి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు అవుతున్నాయి. సురభి పాత్రలో నటించిన అమ్మాయి పేరు సయ్యద్ ఫర్జానా. ఈమె రెండేళ్లు ఉన్నప్పుడు ఐపీఎల్ యాడ్ లో నటించింది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమోలో కూడా ఈమె కనబడింది. సలార్ కంటే ముందు ఓరి దేవుడా, ఝాన్సీ అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. సలార్ సినిమాలోని సురభి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేశారు.
Advertisement
Salaar Movie Child Artist Sayyed Farzana
కానీ ఈమెకి అవకాశం వచ్చింది. ఈ ఛాన్స్ మోడల్స్ వరల్డ్ ఏజెన్సీ నుండి ఆమెకి వచ్చింది ఇందులో చాలామంది అడిషన్ కి వచ్చినప్పటికీ ప్రశాంత్ నీల్ కి ఈమెనే నచ్చారట. పెద్ద స్టార్లతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు నా చదువు కంటిన్యూ చేస్తూనే షూటింగ్లో పాల్గొన్నాను. ఈ సినిమా విడుదల హిట్ టాక్ వచ్చాక చాలామంది నన్ను అభినందిస్తున్నారు. అలానే నా రోల్ ని కూడా అభినందిస్తున్నారు అని ఈమె చెప్పుకొచ్చారు. అలానే ఇంత పెద్ద సినిమాలో చేయడం నాకు చాలా గర్వంగా ఉందని కూడా ఫర్జానా అన్నారు ఇక ఈ సినిమాలో ఫర్జానా నటన చూసి చాలామంది ఈమెకి మంచి భవిష్యత్తు ఉంటుందని అవకాశాలు బాగా వస్తాయని అంటున్నారు.
Salaar Movie Child Artist Sayyed Farzana
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!